సొంత నియోజ‌క‌వ‌ర్గంలో లంచ్ బాక్స్ తో మోడీ

Update: 2016-12-23 11:05 GMT
ప‌్ర‌ధానమంత్రి  న‌రేంద్ర మోడీ మ‌రోమారు త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నారు. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం వార‌ణాసిలో స‌భ నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. ఈ స‌భ‌కు 26 వేల మంది బీజేపీ కార్య‌క‌ర్త‌లు హాజ‌ర‌య్యారు. ఈ సభ ప్ర‌త్యేక‌త ఏంటంటే.. హాజ‌ర‌య్యే ప్ర‌తి ఒక్క‌రికీ ఎవ‌రి భోజ‌నం వాళ్లే తెచ్చుకోవాల‌ని ఆ పార్టీ పెద్ద‌లు ముందే పిలుపునిచ్చారు. దీంతో ప్ర‌ధాని మోదీ కూడా త‌న లంచ్ బాక్స్ వెంట తెచ్చుకోవ‌డం విశేషం.

అంద‌రితో క‌లిసి భోజనం చేస్తున్న ఫొటోల‌ను ట్విట్ట‌ర్‌ లో షేర్ చేసిన భార‌తీయ జ‌న‌తా పార్టీ.. ఇలాంటి స‌మానత్వం బీజేపీలోనే సాధ్య‌మ‌ని కామెంట్ చేసింది. నేను కూడా ఓ కార్య‌క‌ర్త‌నే కాబ‌ట్టి నా లంచ్ బాక్స్ నేను తెచ్చుకున్నా అని మోదీ అన్న‌ట్లు పార్టీ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఈ స‌భ‌కు వ‌చ్చిన చాలా మంది మోదీ కోసం భోజ‌నం తీసుకొచ్చినా.. ఆయ‌న మాత్రం త‌న లంచ్ బాక్సే తిన్న‌ట్లు మ‌రో ట్వీట్‌ లో పార్టీ తెలిపింది. ఈ స‌భ‌కు 26 వేల మంది బీజేపీ కార్య‌క‌ర్త‌లు హాజ‌ర‌య్యారు.

ఇదిలాఉండ‌గా భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) అధ్యక్షురాలిగా పూనం మహాజన్ నియమితులయ్యారు. ఆమె బీజేపీ సీనియర్ నేత ప్రమోద్ మహాజన్ కూతురు. తండ్రి హత్య తర్వాత నాలుగేండ్లకు 2009లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఓటమి పాలైన పూనం మహాజన్ ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. ఉమాభారతి తర్వాత బీజేవైఎం చీఫ్‌గా మహిళను నియమించడం ఇదే ప్రథమం. ఇంతకుముందు ఆమె తండ్రి ప్రమోద్ మహాజన్, ప్రస్తుత కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ బీజేవైఎం అధ్యక్షులుగా పనిచేశారు. ఆరెస్సెస్- ఢిల్లీ హై కమాండ్-మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌లతో సంబంధాల పునరుద్ధరణకు ఆమె ప్రయత్నిస్తారని స‌మాచారం. 2010లో బీజేవైఎం ఉపాధ్యక్షురాలిగా, 2013లో బీజేపీ జాతీయ కార్యదర్శిగా నియమితురాలయ్యారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News