మోడీది ఎంత మాస్టర్ మైండో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ విషయంలో ఎవరికి ఎలాంటి సందేహాలు కూడా లేవు. కొద్దిరోజులుగా ఆయన ఒక ప్లాన్ ను క్రమపద్ధతిలో అమలు చేస్తున్నట్లుగా చెప్పాలి. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇమేజ్ ను పూర్తిగా మార్చేయటమే కాదు.. ఆయన వ్యాఖ్యల్ని ఎవరూ సీరియస్ గా తీసుకోకూడదన్న రీతిలో మోడీ మాటలు మాట్లాడటం గమనార్హం.
రాహుల్ ను సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరంలేదన్నట్లుగా తన మాటలతో చెప్పటం.. ఆయనో కమేడియన్ అన్నట్లుగా చెప్పటమేకాదు.. కావాలంటూ సాక్ష్యాలు ఇదిగో అంటూ మోడీ చేస్తున్న వ్యాఖ్యలు చూస్తున్నప్పుడు.. తన ప్రత్యర్థిని ఎదుర్కోవటానికి మైండ్ గేమ్ మొదలెట్టినట్లుగా చెప్పొచ్చు. తనకు తానుగా రాహుల్ గా లాంటి విమర్శ చేయని మోడీ.. ఒకవేళ తనపై విమర్శల్ని సంధించినప్పుడు.. పూర్తిగా వర్క్ వుట్ చేసి.. ఆయన బలహీనతల్ని తెర మీదకు తీసుకొచ్చి చెడుగుడు ఆడుకుంటున్నారు.
మాజీ ప్రధాని మన్మోహన్ పై రెయిన్ కోట్ వ్యాఖ్యలు చేసిన సంచలనాలకు తెర తీసిన మోడీపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ తీవ్రస్థాయిలో ఫైర్ కావటమే కాదు.. మోడీపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇలాంటి వాటికి సీరియస్ గా స్పందించకుండా చాలా తేలిగ్గా తీసుకుంటున్నట్లుగా వ్యవహరిస్తూనే.. రాహుల్ పై ఘాటైన జోకులు పేల్చారు. ఇక్కడ గమనించాల్సిందేమిటంటే.. ఘాటైన విమర్శలు చేసినప్పుడురాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతుంది. అదే జరిగితే ఇరు వర్గాల మాటల్నిప్రజలు సీరియస్ గా గమనిస్తుంటారు.
కానీ.. అలాంటిదేమీ లేకుండా.. రాహుల్ ను ఒక కమేడియన్ గా.. ఆయన వ్యాఖ్యల్లో ఎలాంటి అర్థం ఉండదన్న రీతిలో చెప్పటం ద్వారా.. ఆయన్ను ఎవరూ సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదన్న విషయాన్ని తేల్చేశారు. అదే సమయంలో రాహుల్ పేరును నేరుగా ప్రస్తావించకుండా వ్యాఖ్యలు చేయటం గమనార్హం. ‘‘కాంగ్రెస్ లో ఒక నాయకుడు ఉన్నాడు. ఆయన చర్యలన్నీ పిల్ల చేష్టలే. మీరు కంప్యూటర్ లో వెతికితే.. ఆయనపై ఉన్నన్నిజోకులుమరే నేతపైనా కనిపించవు. ఆయనతో చేతులు కలిపిన అఖిలేశ్ మీదా అనుమానాలు కలుగుతున్నాయి’’ అంటూ ఎద్దేవా చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు రాహుల్ ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీస్తుందన్న మాట వినిపిస్తోంది. కాంగ్రెస్ యువరాజు సీరియస్ పొలిటీషియన్ కాదు.. ఆయనలో అపరిపక్వత ఉందన్నట్లుగా మోడీ చెబుతున్న మాటలు ప్రజల మనసుల్లోకి స్లో పాయిజన్ లా వెళుతున్నాయన్న భావన వ్యక్తమవుతోంది. అదే జరిగితే రాహుల్ కు మా గొప్ప ఇబ్బందని చెప్పక తప్పదు.