మోడీకి ఆ గౌరవం దక్కుతుందా ?

Update: 2015-11-19 11:45 GMT
 ఏటా టైమ్స్ పత్రిక నిర్వహించే 'పర్సన్ ఆఫ్ ద ఇయర్' గుర్తింపు రేసులో భారత ప్రధాని నరేంద్ర మోడీ మంచి పొజిషన్ లోనే ఉన్నారు. రష్యా ప్రధాని పుతిన్ కంటే ఆయన ముందున్నారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ, భారత సంతతికి చెందిన గూగుల్‌ సిఇఓ సుందర్‌ పిచాయ్‌ కూడా ఈ రేసులో ఉన్నారు. టైమ్స్ పత్రిక 2015 సంవత్సరానికిగాను పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ను వచ్చే నెలలో ప్రకటించనుంది.  తమ మంచి పనుల ద్వారా కానీ, చెడ్డ పనుల ద్వారా కానీ అత్యంత ప్రభావం చూపిన వ్యక్తుల నుంచి పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ను టైమ్‌ ఎంపిక చేస్తుంది.

ఈ సందర్భంగా ఆ పత్రిక ఈ రేసులో ఉన్నవారి గురించి బ్రీఫింగ్ ఇచ్చింది. దేశంలోని అత్యంత పెద్ద ప్రజాస్వామిక దేశాన్ని విదేశీ ప్రత్యక్ష పట్టుబడులతో ఆధునీకరించే దిశగా మోడీ కృషి చేస్తున్నారని ఆ పత్రిక పర్కొంది. అయితే హిందూ అతివాదిగా ఆయనను కొందరు విమర్శిస్తున్నారని టైమ్స్ పేర్కొంది. అంబానీ విషయానికొస్తే.. భారత్‌లోనే అత్యంత ధనవంతుడైన అంబానీ టెలికామ్‌ సంస్థల నుంచి ప్రపంచంలోనే అతి పెద్దదైన ముడి చమురు రిఫైనరీ కలిగిన వ్యక్తి అని టైమ్‌ తెలిపింది. పిచాయ్‌ పదకొండేళ్లు గూగుల్‌ లో పని చేసి, ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు లారీ పేజ్‌ కుడిభుజంగా పేరొంది, ప్రస్తుతం ఆ సంస్థలో అత్యున్నత స్థానంలో ఉన్నాడని టైమ్‌ పేర్కొంది. పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ కు తమ ఓట్లు వేయాల్సిందిగా ఆ పత్రిక పాఠకులను కోరింది. మోడీకి ఇంతవరకూ 1.3 శాతం ఓట్లు రాగా, పిచాయ్‌ కు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ కు కూడా అదే శాతం ఓట్లు వచ్చాయి. అంబానీకి అతి తక్కువగా 0.2 శాతం ఓట్లు వచ్చాయి.

కాగా బీహార్ ఎన్నికల తరువాత మోడీ ప్రభ కొంత తగ్గుముఖం పట్టిందని ఈ ప్రభావం ఆయనకు ఈ గుర్తింపు దక్కడంలో ఆటంకంగా ఉండొచ్చని కొందరు పేర్కొంటున్నారు. అయితే.. అదేమీ లేదని... మోడీ హవా ఏమాత్రం తగ్గలేదని, ఆయన టైమ్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ కావడం గ్యారంటీ అని బీజేపీ నేతలు అంటున్నారు.
Tags:    

Similar News