మోడీ వెళ్లిన పెళ్లికి దావూద్ వెళ్లాడా?

Update: 2016-01-13 06:35 GMT
సర్ ప్రైజ్ విజిట్ తో ప్రధాని మోడీ పాక్ కు వెళ్లటం తెలిసిందే. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ పుట్టిన రోజు సందర్భంగా బర్త్ డే విషెస్ చెప్పటానికి పాక్ కు వెళ్లటం.. అదే రోజు నవాజ్ షరీఫ్ మనమరాలు మెహరూన్ నిసా పెళ్లి జరగటం తెలిసిందే. ఇదంతా లాహోర్ లోని నవాజ్ షరీఫ్ సొంతిల్లు లాంటి రాజసౌధంలో జరిగింది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్లికి వెళ్లిన మోడీ.. నవాజ్ షరీఫ్ తల్లికి పాదాభివందనం చేసి వచ్చారు. కాసేపు పెళ్లింట్లో గడిపిన మోడీ.. తిరిగి భారత్ కు వచ్చేయటం.. దీనికి అంతర్జాతీయంగా పెద్ద ఎత్తున ప్రశంసలు రావటం జరిగింది.

అయితే.. ఈ పెళ్లి వ్యవహారం ఇప్పుడు వివాదంగా మారనుంది. ఎందుకంటే.. నవాజ్ షరీఫ్ ఇంట జరిగిన పెళ్లిన ప్రధాని మోడీతో పాటు.. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సకుటుంబ సమేతంగా హాజరు అయినట్లుగా పేర్కొంటూ ఒక న్యూస్ ఛానల్ సంచలన కథనాన్ని ప్రసారం చేయటం కలకలంగా మారింది. కాకుంటే.. మోడీ వెళ్లిన పక్క రోజున దావూద్ వెళ్లారని సదరు కథనం వెల్లడిస్తోంది.

పెళ్లికి పిలిచిన వెంటనే సదరు పెళ్లికి ఎవరు వెళుతున్నారు? ఏంటన్న విషయాలు పట్టించుకోకుండా వెళ్లటం ఏమిటన్నది ఇప్పుడో ప్రశ్నగా మారితే.. శత్రు దేశంలోకి అడుగు పెట్టటం.. లాంటి విషయంలో మోడీ దుందుడుకుగా నిర్ణయాలు తీసుకున్నట్లుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత జరుగుతుంటే భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నట్లన్నది ఇప్పుడో పెద్ద ప్రశ్న. నవాజ్ ఇంట జరిగే పెళ్లికి దావూద్ లాంటి అండర్ వరల్డ్ డాన్ లాంటి వారు హాజరు కానున్నారన్న విషయాన్ని నిఘా వర్గాలు గుర్తించకపోవటం ఏమిటన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.  భారతదేశం ఎంతోకాలంగా వెతుకుతున్న అండర్ వరల్డ్ డాన్ ఏకంగా ప్రధాని మోడీ వెళ్లిన పెళ్లింటికి వెళ్లినట్లుగా వస్తున్న వార్తలు నిజమైతే మోడీ అండ్ కో ఇరుకున పడినట్లే.
Tags:    

Similar News