ఒక దేశంలో అంతర్భాగమైన జమ్ముకశ్మీర్ పై మోడీ సర్కారు తీసుకున్న సంచలన నిర్ణయంపై కశ్మీర్ కు చెందిన నేతలు పలువురు వ్యతిరేకిస్తుంటే.. అందుకు భిన్నంగా దేశ ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. జమ్ము కశ్మీర్ కు ప్రత్యేక స్వయం ప్రతిపత్తి హోదా కల్పిస్తున్న ఆర్టికల్ 370ను రద్దు చేస్తున్నట్లుగా రాజ్యసభలో కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా ప్రకటించటం.. కీలకమైన 35ఏ రద్దుతో పాటు.. కశ్మీర్ సమస్యకు కీలక పరిష్కారమైన జమ్ముకశ్మీర్ ను మూడు ముక్కలు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
తాజాగా తీసుకున్న నిర్ణయంతో జమ్ము.. కశ్మీర్.. అద్దాక్ ప్రాంతాల్ని వేర్వేరుగా చేశారు. ఇకపై జమ్ము.. కశ్మీర్ లో అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతాలుగా మారతాయి. అద్దాక్ అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా ఉంటుంది. ఈ నిర్ణయాన్ని రాజ్యసభలో ప్రవేశ పెట్టిన వెంటనే.. సభలో గందరగోళం చోటు చేసుకుంది. ఇదిలా ఉంటే.. మరోవైపు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాలపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సంతకం పెట్టేయటం ద్వారా ఆర్డినెన్స్ జారీ అయ్యింది.
విచిత్రమైన విషయం ఏమంటే.. ఆర్టికల్ 370.. 35ఏలను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. నానా యాగీ చేస్తున్నాయి. అయితే.. వారి వాదనలో పస లేదని చెప్పాలి. ఎందుకంటే.. మోడీ సర్కారు ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయాలు కావు. తమ ఎన్నికల ప్రణాళికలోనూ.. తాము మరోసారి అధికారంలోకి వస్తే.. కశ్మీర్ విషయంలో ఏమేం చేస్తామన్న విషయాన్ని చెప్పేశారు. బీజేపీ చెప్పిన మాటలకు ప్రజలు తమ ఓటుతో ఆమోదముద్ర వేయటంతో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నారు. కశ్మీర్ విషయంలో.. ఎన్నికల సమయంలో తామిచ్చిన హామీని మోడీ సర్కారు నెరవేర్చిందని చెప్పాలి. అలాంటప్పుడు దాని మీద యాగీ చేయటంలో అర్థం లేదని చెప్పాలి. ఆర్టికల్ 370.. 35 ఏ రద్దు మోడీ సర్కారు చేసిందని చెప్పే కన్నా.. దీనికి దేశ ప్రజలు సైతం సానుకూలంగా ఓటేశారు. దేశ ప్రజల మనోభావాలకు తగినట్లుగా మోడీ నిర్ణయం తీసుకున్నారని చెప్పక తప్పదు.