మోడీ క్యాబినెట్ కొత్త టీంలో గతంలో మంత్రులకు పనిచేసిన 37 మంది ఈ సారి స్థానం లభించలేదు.. ఇందులో ఓడిన వారి సంఖ్యతో వేళ్లపైనే లెక్కపెట్టవచ్చు.. గత క్యాబినెట్ లో మంత్రులుగా పనిచేసిన మేనకా గాంధీ - రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ - జేపీ నడ్డా - సురేష్ ప్రభుతో పాటు పలువురు మంత్రులకు అవకాశం దక్కలేదు.. ఈ సారి ఘన విజయం సాధించిన బిజెపి.. ఎన్డీఏ క్యాబినెట్ టీంలో మాత్రం ప్రధానంగా విధేయతకు పెద్ద పీట వేశారంటున్నారు.. గతంలో మంత్రులు పనిచేసిన వాళ్లలో కొందరు పనితీరు - వివాదస్పద విషయాల్లో జోక్యం చేసుకోవడం - బంధు ప్రీతి వీటన్నింటి నేఫథ్యంలో కొందరు మంత్రులకు అవకాశం దక్కలేదంటున్నారు..
పోనీ ఓడిపోయారు కదా అందుకే అవకాశం దక్కలేదని కొందరంటున్నా.. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన హరి కృఫాల్ సింగ్ ను క్యాబినెట్ ర్యాంకుతో కేంద్ర పౌరవిమానయాన శాఖ కేటాయించారు.. మోడీ... ఇక అరుణ్ జైట్లీ - సుష్మా స్వరాజ్ లకు అనారోగ్య కారణాలతో దూరం పెట్టారనుకున్నా.. వ్యవహార తీరు కారణంగా ఉమాభారతికి చెక్ పెట్టినా.. బిజెపి అధ్యక్షుడిగా జేపి నడ్డాకు అవకాశం రాబోతుందున్న వార్తల నేపథ్యంలో 8వ సారి గెలుపొందిన మాజీ కేంద్ర మంత్రి మేనకా గాంధీ కి క్యాబినెట్ లో అవకాశం దక్కకపోవడం హాట్ టాఫిక్ అయ్యింది.. ప్రోటెం స్పీకర్ గా సభ్యుల ప్రమాణం కోసం ఉంచారంటే అది ఆ ఒక్క రోజు జరిగే సాంప్రదాయమే.. పోనీ స్పీకర్ గా అవకాశమిస్తారంటే ఆ వార్తలను బిజెపి అగ్రనేతలు ధృవీకరించడం లేదు...
ముఖ్యంగా ప్రచారంలో ప్రధానంగా నెహ్రు నుంచి రాహుల్ వరకు గాంధీ ఫ్యామిలీని టార్గెట్ చేసిన మోడీ - బిజెపి నేతలు... తాజాగా మేనకాగాంధీకి కూడా చెక్ పెట్టబోతున్నారా అన్న చర్చ బలంగా సాగుతోంది.. అవుట్ రీచ్ లో భాగంగా ప్రియాంకా గాంధీ గతంలో తమకు దూరమైన నేతలను - కుటుంబ సభ్యులను దగ్గర చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు.. అరుణ్ నెహ్రు కూతురికి మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్ ఇవ్వడమే కారణం.. అలాగే మేనకా గాంధి ఆమె తనయుడు వరుణ్ గాంధీలు కూడా కాంగ్రెస్ లో చేరతారని ముఖ్యంగా ప్రియాంకా పిలుపు మేరకు సానుకూలంగా ఉన్నారంటూ గతంలో వార్తలొచ్చాయి.. వీటన్నింటి నేఫథ్యంలో మేనకా గాంధీని పక్కన పెట్టారనే ప్రచారం జరుగుతోంది.. ఒక వేళ స్పీకర్ గా మేనకా గాంధీకి అవకాశం రాకపోతే పైన చెప్పింది నిజం కావోచ్చు....