ఈ దీపావళిని ప్రత్యేకంగా జరుపుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సరిహద్దుల్లో భద్రతా విధులు నిర్వర్తిస్తున్న జవాన్ల వద్దకు వెళ్లిన విషయం తెలిసిందే. మోదీ ఇవాళ రాజస్థాన్ లోని లోంగేవాలా సైనిక స్థావరాన్ని సందర్శించారు. అక్కడి వీర సైనికులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఆయన వారికి మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఓ యుద్ధ ట్యాంకులో ప్రయాణించారు. సైనికుల యుద్ధ సన్నద్ధతను స్వయంగా తిలకించారు. ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. మోదీ కూడా సైనిక దుస్తుల్లోనే ఉండడంతో రెజిమెంట్ లోని జవాన్లతో కలిసిపోయారు. కాగా, మోదీ భారత ప్రధానిగా పీఠం ఎక్కినప్పటి నుంచి దీపావళిని సైనికులతోనే జరుపుకుంటున్నారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. భద్రతా బలగాలకు భారతీయుల తరఫున దీపావళి శుభాకాంక్షలు తెలుపుతున్నానని చెప్పారు. వీర మరణం చెందిన సైనికులకు నివాళులర్పిస్తున్నానని ప్రధాని మోదీ తెలిపారు. సైనికుల మధ్యకు వచ్చినప్పుడు తనకు అసలైన దీపావళిని జరుపుకుంటున్నట్లు అనిపిస్తుందని చెప్పారు. సైనికులు ఉత్సాహంగా ఉంటేనే దేశ ప్రజలు ఉత్సాహంగా ఉంటారని మోదీ తెలిపారు. దేశాన్ని రక్షించే సైనికులను చూసి యావత్ భారతావని గర్వపడుతోందని చెప్పారు. ఆక్రమణదారులు, ఉగ్రవాదులను ఎదుర్కొనే ధైర్యం సైనికులను ఉందని చెప్పారు. ఉగ్రవాదులను భారత్ అంతమొందిస్తోందని చెప్పారు. దేశ భద్రత విషయంలో భారత్ రాజీపడబోదని ప్రపంచం యావత్తు నేడు గుర్తిస్తోందని తెలిపారు.