ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల జపాన్ పర్యటన ముగిసింది. ఆయన తన పర్యటనను ముగించుకుని ఢిల్లీ తిరుగు పయనమయ్యారు. అంతకు ముందు ఆయన కొబే నగరంలో భారత సంతతి వారితో మాట్లాడారు. జపాన్ లోని కోబెలో భారత సంతతి ప్రజలతో జరిగిన సమావేశంలో ఇవాళ మోడీ మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దును స్వాగతించిన దేశ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా 500 -వెయ్యి నోట్ల రద్దుపై ఆయన స్పందించారు. దొంగ డబ్బును వెలికి తీయాలా లేదా అని ఆయన ప్రశ్నించారు. గతంలో గంగా నదిలో ఎవ్వరూ ఒక్క రూపాయి కూడా వేయకపోయేవారని - ఇప్పుడు అదే నదిలో 500 - వెయ్యి నోట్లు ప్రవహిస్తున్నాయన్నారు. తాము తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించిన ప్రజలకు ప్రధానమంత్రి మోడీ సెల్యూట్ చేశారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రజలకు తమకు మద్దతుగా నిలిచారని ఆయన అన్నారు.
నల్లధనాన్ని ఎలా వెలికి తీయాలని తీవ్రంగా ఆలోచించానని, దానికి సంబంధించి తమ టీమ్ కూడా మార్గాలను అన్వేషించిందని, కానీ ఎవరితోనూ తాను ఆ అభిప్రాయాన్ని పంచుకోలేదని ఈ సందర్భంగా మోడీ తెలిపారు. పెద్ద నోట్ల రద్దు అతిపెద్ద స్వచ్ఛ కార్యక్రమమని, ఎవరినీ బాధపెట్టేందుకు తీసుకున్న నిర్ణయం కాదన్నారు. నోట్ల రద్దు అంశం రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయం కాదని, దానికో పథకాన్ని ప్రవేశపెట్టామని, అవకాశం ఇవ్వలేదన్నది వాస్తవం కాదన్నారు. నోట్ల మార్పిడి అంశంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, డిసెంబర్ 30 వరకు నోట్లను మార్చుకోవచ్చు అని ప్రధానమంత్రి మోడీ అన్నారు. స్వాతంత్రం వచ్చిన రోజు నుంచి నల్లధనం కలిగి ఉన్న వాళ్ల రికార్డులను పరిశీలించనున్నట్లు, ఎవరినీ వదిలేది లేదని జపాన్ వేదికగా మోడీ స్పష్టం చేశారు. ఎఫ్ డీఐ అంటే విదేశీ పెట్టుబడులు మాత్రమే కాదని, ఫస్ట్ డెవలప్ ఇండియా అని నిరూపిస్తామన్నారు. గుజరాత్ లో భూకంపం వచ్చినప్పుడు కోబె ప్రజలు ఆదుకున్నారని ఆయన గుర్తు చేశారు.
మరోవైపు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బ్యాంకర్లతో అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్న చిన్న సమస్యలున్నప్పటికీ నోట్ల మార్పిడి ప్రక్రియ సజావుగా సాగుతుందన్నారు. ఇందుకు సహకరిస్తున్న ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గత మూడు రోజుల నుంచి పాత నోట్లను మార్చుకునేందుకు ప్రజలు బ్యాంకుల వద్ద క్యూ కడుతున్నారని తెలిపారు. ఇప్పటి వరకు 86 శాతం నోట్ల మార్పిడి జరిగిందన్నారు. కేవలం ఎస్బీఐ గ్రూపు రూ.2 కోట్ల 28 లక్షల లావాదేవీలు జరిపిందన్నారు. నేటి వరకు ఎస్ బీఐ బ్యాంకుల వల్ల 58 లక్షల మంది నోట్ల మార్పిడి చేసుకున్నారని అరుణ్ జైట్లీ తెలిపారు. బ్యాంకు ఉద్యోగులు కూడా రాత్రి పగలు అనకుండా కష్టపడుతున్నారని జైట్లీ కితాబిచ్చారు. నోట్ల మార్పిడి అనేది అతిపెద్ద ఆపరేషన్ అని తెలిపారు. ఎప్పటికప్పుడు బ్యాంకుల్లో జరుగుతున్న లావాదేవీలను సమీక్షిస్తున్నామని తెలిపారు. కొత్త నోట్లకు తగ్గట్లుగా ఏటీఎం మెషీన్లు లేవని, ఆ ప్రక్రియను కూడా వేగవంతంగా పూర్తి చేయనున్నట్లు ఆయన చెప్పారు. నోట్ల మార్పిడిలో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకుంటాయన్నారు. కొత్త నోట్లలో ఎలక్ట్రానిక్ చిప్ ఉందన్న వదంతులను నమ్మరాదని జైట్లీ అన్నారు. బ్యాంకుల దగ్గర జంన బారులు తీరిన విషయం వాస్తవమే అని, కానీ ఎక్కడ ఆందోళన చోటుచేసుకోలేదన్నారు. ప్రజలకు అసౌకర్యం కలిగినందుకు చింతిస్తున్నామన్నారు. నోట్ల మార్పిడిపై భిన్నమైన రాజకీయ అభిప్రాయాలు వినిపిస్తున్నాయని, కొందరు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని జైట్లీ విమర్శించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/