సమకాలీన రాజకీయాల్లో ఏ ప్రధానమంత్రి తీసుకోని రీతిలో సంచలన రీతిలో పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రధాని మోడీ తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నెల 8న ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకున్న తర్వాత.. ఆయనకెంతో ఇష్టమైన మన్ కీ బాత్ కార్యక్రమాన్ని (తెలుగులో మనసులో మాటగా తెలుగీకరించారు) ఆయన ఈ రోజు ఉదయం నిర్వహించారు.
ఎప్పటిలానే తాను ప్రస్తావించే అంశాలకు సంబంధించి గ్రౌండ్ లెవల్లో ఏం జరుగుతుందో చెప్పటంతో పాటు.. సదరు అంశానికి సంబంధించి అందరిలో ఆసక్తిని రేకెత్తించేలా.. స్ఫూర్తి కలిగేలా ఉదాహరణలు చెప్పటం ఉంటుంది. అలాంటివి మిస్ కాకుండా చూసుకున్న మోడీ.. తాజా మనసులోని మాటలో నోట్ల రద్దు అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. తాను తీసుకున్న నిర్ణయంపై గడచిన కొద్దిరోజులుగా రాజకీయ పార్టీలు.. తన ప్రత్యర్థులు గురి పెడుతున్న అంశాల్ని ప్రస్తావించిన ఆయన.. రద్దుతో కలిగే కొన్ని సానుకూల అంశాల్ని ప్రస్తావించారు. తాను తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయానికి తనను ప్రభావితం చేసిన అంశాల్ని ఆయన ప్రస్తావించారు.
కెన్యాలోని ఎం-పెసా విధానాన్ని చెప్పిన ప్రధాని.. వోడాఫోన్ 2007లో కెన్యాలో ఈ విధానాన్ని ప్రవేశ పెట్టిందని.. మొబైల్ ఫోన్ తో నగదు రహిత లావాదేవీల్ని జరిపే ఈ అంశాన్ని మన పరిభాషలో క్యాష్ లెస్ విధానం అంటారని.. దీన్ని సరిగ్గా అమలు చేస్తే.. బ్లాక్ మనీకి చెక్ పెట్టొచ్చన్నారు. పెద్దనోట్ల రద్దుతో 50 రోజుల పాటు ఇబ్బందులు ఉంటాయన్న విషయాన్ని తాను గతంలోనే చెప్పానని.. దేశ ప్రయోజనాల కోసమే తాను రద్దు నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెప్పారు. పెద్దనోట్ల రద్దు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు బ్యాంకు.. పోస్టాపీసు ఉద్యోగులు ఎంతో కష్టపడుతున్నారన్న ఆయన.. పెద్దనోట్ల రద్దుకు సహకరిస్తున్న ప్రతిఒక్కరికి ధన్యవాదాలు చెప్పారు.
నోట్ల రద్దు కారణంగా ప్రజలు పడుతున్నఇబ్బందిని తాను అర్థం చేసుకోగలనని చెప్పిన మోడీ.. 70 ఏళ్లుగా పేరుకుపోయిన అవినీతిని తొలగించటం అంత తేలికైన విషయం కాదన్నారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో దేశానికి కచ్ఛితంగా మంచేజరుగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసిన ఆయన.. కొంతమంది వ్యక్తులు తమ దగ్గర ఉన్న నల్లధనాన్ని మార్చుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్న విషయాన్ని ప్రస్తావించిన ఆయన.. ఇందుకోసం పేదల్ని అస్త్రంగా చేసుకోవాలని భావిస్తున్నట్లుగా చెప్పారు.
అందుకే.. జన్ ధన్ ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని.. ఇతరుల డబ్బుల్ని అకౌంట్లో వేసుకొని సామాన్యులు ఇబ్బందులు పడకూడదన్న విషయాన్ని చెప్పిన మోడీ.. త్వరలోనే బినామీ ఖాతాదారుల పని పడతామన్న ఆయన.. అలాంటి వారిని నియంత్రించేందుకు కఠినమైన చట్టాన్ని తీసుకురానున్న విషయాన్ని వెల్లడించారు. నగదు రహిత లావాదేవీలకు ప్రజలు కలిసి రావాలని.. టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని.. మొబైల్ ద్వారా డబ్బుల్నిబదిలీ చేయటం.. స్నేహితుడికి జోక్ ను పంపించినంత సులువుగా నగదును బదిలీ చేయొచ్చన్నారు. చిరు వ్యాపారులు మొదలు వ్యాపారులంతా డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెట్టటానికి ఇదే సరైన సమయం అని చెప్పిన ఆయన.. గతంలో పేదలు జన్ ధన్ రూపే కార్డులు ఉపయోగించే వారు కాదని.. ఆ వినియోగం ఇప్పుడు ఏకంగా 300 రెట్లు పెరిగిన విషయాన్ని ప్రస్తావించారు.
నోట్ల రద్దు నేపథ్యంలో తన దృష్టికి వచ్చిన ఉదంతాల్ని ప్రస్తావించిన మోడీ.. నెగిటివ్ అంశాలైన బ్యాంకుల వద్ద క్యూలైన్ల వద్ద మరణించిన వారి గురించి మాటకు కూడా ప్రస్తావించలేదు. అదే సమయంలో రద్దు నేపథ్యంలో కొన్ని రెస్టారెంట్లు ఫ్రీగా ఆహారపదార్థాల్ని పంపిణీ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. నోట్ల రద్దు కారణంగా సూరత్ లో ఒక జంట రూ.500లతోపెళ్లి చేసుకున్న విషయాన్ని ప్రస్తావించిన మోడీ.. వారిని ప్రశంసించారు. ప్రతిఒక్కరూ పరిస్థితిని అర్థం చేసుకోవాలన్న ఆయన.. రోజువారీ కూలీలు సైతం బ్యాంకు ఖాతాలు తెరవాలని.. నగదు రహిత సమాజమే తన స్వప్నమన్న అసలు విషయాన్ని మోడీ చెప్పేశారు. నోట్ల రద్దు కార్యక్రమం మొదటి అడుగు మాత్రమేనని మోడీ చెప్పిన దానికి.. తాజాగా తన లక్ష్యం ఏమిటన్నది తాజా మన్ కీ బాత్ తో తేల్చి చెప్పారని చెప్పాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/