ప్రస్తుతం దేశవ్యాప్తంగా సీఏఏ - ఎన్నార్సీ - ఎన్ పీఆర్‌లకు వ్యతిరేకంగా ఆందోళనలు - నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మత ప్రాదిపదికన దేశాన్ని విడగొట్టాలని మోడీ సర్కార్ యోచిస్తోందని ముస్లింలు వాదిస్తుండగా.....కేవలం అక్రమ చొరబాటుదారులను ఏరివేయడానికే ఈ చట్టం తెచ్చామని - దీని వల్ల భారతీయ ముస్లింలకు ఎటువంటి ఇబ్బంది ఉండదని కేంద్రం వాదిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా జరుగుతున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోనూ ఈ వ్యవహారం చర్చకు వచ్చింది. ఈ బిల్లులపై అధికార, విపక్ష సభ్యుల మధ్య వాడీవేడీ వాదనలు సాగుతున్నాయి. ఈ క్రమంలో ఈ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం ప్రధాని కావాలన్న ఒకే ఒక ఆకాంక్షతో అఖండ భారత దేశాన్ని నెహ్రూ ముక్కలు చేశారని మోడీ షాకింగ్ కామెంట్స్ చేశారు.
రాష్ట్రపతి తీర్మానానికి ధన్యవాదాలు తెలిపే ప్రసంగం సందర్భంగా కాంగ్రెస్ పై ప్రధాని నరేంద్ర మోడీ నిప్పులు చెరిగారు. దేశ విభజన తర్వాత హిందువులను - సిక్కులతో పాటు పలువురు మైనారిటీలను హింసించిన ఘటనలు దేశం మరిచిపోలేదన్నారు. లియాఖత్ ఒప్పందం పాక్ లోని మైనారిటీలను ఎలాంటి ఇబ్బందులకు గురిచేయమని సంతకాలు చేశారని మోడీ గుర్తు చేశారు. తాను సెక్యులర్ అని చెప్పుకునే నెహ్రూ ....ఆ ఒప్పందంలో పౌరులకు బదులుగా మైనారిటీలన్న పదం ఎందుకు వాడారో చెప్పాలని మోడీ నిలదీశారు. సీఏఏతో ఏ ఒక్క పౌరుడికీ - మతానికి ఇబ్బంది లేదని మోడీ పునరుద్ఘాటించారు. విశ్వాసాలవారీగా ప్రజలను విడగొట్టాలని కాంగ్రెస్ చూస్తోందని - అందరూ భారతీయులే అన్న దృష్టికోణం తమదని మోడీ స్పష్టం చేశారు.