పెద్ద నోట్ల రద్దు సమయంలో ప్రకటించిన యాభై రోజుల గడువు ముగిసిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే 3 నెలల్లో కిసాన్ క్రెడిట్ కార్డులను రూపే కార్డులుగా మారుస్తామన్నారు. మూడు కోట్ల కిసాన్ క్రెడిట్ కార్డులను రూపే కార్డులుగా మార్చటం ద్వారా రైతుల్లో నగదురహిత లావాదేవీలు జరుగుతాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలు విస్తరించాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలించామన్నారు. చిన్న - మధ్యతరహా వ్యాపారులకిచ్చే రుణపరిమితి రూ. కోటి నుంచి రూ. 2 కోట్లకు పెంచుతున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా గర్భిణిలకు వైద్యసాయం కోసం అందించే రూ. 6 వేలు వారి అకౌంట్‌లో జమ చేయనున్నట్లు తెలిపారు. సీనియర్ సిటిజన్స్ రూ. 7.5 లక్షల వరకు బ్యాంకుల్లో దాచుకున్న నగదుపై 8 శాతం వడ్డీ చెల్లించనున్నట్లు వెల్లడించారు. సహకార బ్యాంకుల్లో రైతులు తీసుకున్న రుణాలపై 2 నెలల వడ్డీని ప్రభుత్వం భరిస్తుందని ప్రధాని మోదీ తెలిపారు.
--- కొత్త ఏడాదికి స్వాగతం పలికిన ప్రధాని నూతన సంవత్సరంలో నూతనోత్తేజంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. దీపావళి తర్వాత నల్లధనంపై ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నామన్న ఆయన దేశ ప్రజల సహకారంతో ప్రక్షాళన యజ్ఞం సాగిందన్నారు. ఆ నిర్ణయం భవిష్యత్తులో ఉత్తమ ఫలాలు అందిస్తుందని తెలిపారు. అవినీతి అంతం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నరన్న ప్రధాని చెడును ఓడించడానికి పోరాటం కొనసాగుతుందన్నారు. అవినీతిరహిత సమాజ నిర్మాణం కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష అని వెల్లడించారు.
-- పెద్ద నోట్ల రద్దుతో దీపావళి తర్వాత భారత్ చారిత్రక ప్రక్షాళన యజ్ఞం చేపట్టిందని ప్రధానమంత్రి తెలిపారు. ఓ శుద్ధి యజ్ఞమని - నోట్ల రద్దు వల్ల దేశ ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, వారి త్యాగం వృథా పోదని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. నల్లధనంపై యుద్ధం ఆగదని, నల్లధనం రూపు మాపితే భవిష్యత్తులో ధేశం రూపురేఖలు మారతాయన్నారు. నల్లధనంపై పోరులో నిజాయితీపరులు కూడా కొంత ఇబ్బందులు పడ్డారన్నారు. ప్రభుత్వం - ప్రజలు భుజం భుజం కలిపి సాగిస్తున్న పోరాటం ఇదని తెలిపారు. సామాన్యులు గడిచిన కొద్దిరోజులుగా డబ్బుల కోసం కొంత ఇబ్బందులు పడిన విషయం తనకు తెలుసన్న ప్రధాని ప్రజల త్యాగం వారికి భవిష్యత్తులో గొప్ప ఫలితాలను ఇస్తుందన్నారు.
- గడిచిన యాభై రోజులుగా ప్రజలు ఎదుర్కొంటున్న బాధ తనకు తెలుసని ప్రధానమంత్రి అన్నారు. అవినీతి - నల్లధనం - నకిలీ నోట్లతో నిజాయితీపరులు ఇబ్బందులు పడ్డారన్నారు. దేశ ప్రయోజనాల కోసం ఇబ్బందులను సైతం ఎదుర్కొంటామని ఈ సంఘటనతో ప్రజలు నిరూపించారన్నారు. నల్లధనంపై పోరాటంలో ప్రజలు ఎంతో సహనాన్ని ప్రదర్శించారు. కొత్త సంవత్సరంలో బ్యాంకుల్లో పరిస్థితిని ప్రభుత్వం సాధారణ స్థితికి తీసుకువస్తుందని తెలిపారు.
-- నగదు లేకపోవడం వలన తలెత్తిన ఇబ్బందులు కంటే అధిక నగదు వల్ల ఇబ్బందులు అనేకమని ప్రధాని మోదీ అన్నారు. అవినీతిపై పోరులో ప్రజలు రాంమనోహర్ లోహియా - లాల్ బహదూర్ శాస్త్రి - కామరాజ్ - జేపీ వంటి తదితర నేతల చూపిన ధైర్యసాహసాన్ని - సహనాన్ని ప్రదర్శించారన్నారు. గతంలో రూ. 500 - రూ. 1000 నకిలీ నోట్లు సమాంతర ఆర్థిక వ్యవస్థను నడిపాయన్నారు. దేశంలో 24 లక్షల మంది మాత్రమే తమ వార్షిక ఆదాయం రూ. 10 లక్షలకు పైగా ఉన్నట్లు ప్రకటించారు.
--చట్టం తన పని తాను నిష్ఠతో చేస్తుందన్న ప్రధాని నల్లధనం - నకిలీధనంపై పోరాటంలో వెనకడుగు వేసేదే లేదన్నారు. నిజాయితీపరుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ఉద్యోగులు రేయింబవళ్లు కష్టపడుతున్నారని తెలిపారు. బ్యాంకు లావాదేవీలు కొత్త సంవత్సరంలో మరింత సరళతరం అవుతాయన్నారు. పేద - మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకుని బ్యాంకులు పనిచేయాలని సూచించారు. ఇంతకాలం బ్యాంకుల్లోకి రాని నల్లధనం ఇప్పుడు బయటకు వచ్చింది. నల్లధనాన్ని మార్చుకునేందుకు కొందరు చేస్తున్న ప్రయత్నాలను సాగనివ్వమన్నారు. అవినీతి సంపద ప్రధాన ఆర్థిక స్రవంతిలోకి రావాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు.
- పేద - మధ్య తరగతి ప్రజలకు పీఎంఏవై పథకం కింద రెండు నూతన గృహ పథకాలు రాబోతున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. గరీబ్ కళ్యాణ్ పథకం కింద బ్యాంకులు పేదల సంక్షేమానికి కృషి చేయాల్సి ఉందన్నారు. పేద - మధ్యతరగతి ప్రయోజనాలకు తగిన పథకాలను ప్రారంభించమని ప్రధాని బ్యాంకులను కోరారు. గ్రామీణులు - పేదలు - రైతులు - దళితులు - మహిళల అభివృద్ధితో దేశం అభివృద్ధి చెందుతుందన్నారు.
-- సొంతిల్లు అనేది పేదలే కాదు మధ్యతరగతికి కూడా దూరమైందన్నా ప్రధాని పీఎం ఆవాస్ యోజన కింద గ్రామాల్లో పెద్దఎత్తున గృహనిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. పేద - మధ్యతరగతి గృహరుణాలపై వడ్డీ రాయితీని ప్రకటించారు. రూ. 9 లక్షల వరకు గృహరుణాలపై 4శాతం వడ్డీ రాయితీ అదేవిధంగా రూ. 12 లక్షల వరకు గృహరుణాలపై 3 శాతం వడ్డీ రాయితీని ఇవ్వనున్నట్లు పీఎం వెల్లడించారు.

--చట్టం తన పని తాను నిష్ఠతో చేస్తుందన్న ప్రధాని నల్లధనం - నకిలీధనంపై పోరాటంలో వెనకడుగు వేసేదే లేదన్నారు. నిజాయితీపరుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బ్యాంకులు - పోస్టాఫీసుల్లో ఉద్యోగులు రేయింబవళ్లు కష్టపడుతున్నారని తెలిపారు. బ్యాంకు లావాదేవీలు కొత్త సంవత్సరంలో మరింత సరళతరం అవుతాయన్నారు. పేద - మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకుని బ్యాంకులు పనిచేయాలని సూచించారు. ఇంతకాలం బ్యాంకుల్లోకి రాని నల్లధనం ఇప్పుడు బయటకు వచ్చింది. నల్లధనాన్ని మార్చుకునేందుకు కొందరు చేస్తున్న ప్రయత్నాలను సాగనివ్వమన్నారు. అవినీతి సంపద ప్రధాన ఆర్థిక స్రవంతిలోకి రావాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/