ఛండీగఢ్ లోనే మోడీ యోగా డే ఎందుకు..?

Update: 2016-06-20 07:29 GMT
ప్రధాని మోడీ తీరు కాస్త భిన్నం. ఆయన చెప్పే మాటలు విన్నప్పుడు ఒక పరిణితి చెందిన వ్యక్తి చెప్పే మాటల మాదిరి ఉంటాయి. అయితే.. అందులోనూ రాజకీయ కోణం దాగి ఉండటం మోడీ ప్రత్యేకత. తాను చేసే ప్రతి  పనిలోనూ రాజకీయ ప్రయోజనాన్ని పక్కాగా చూసుకోవటం కనిపిస్తుంది. రేపు (జూన్ 21, మంగళవారం) ప్రపంచ యోగా దినాన్ని భారీగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచ యోగ దినాన్ని ప్రకటించిన తర్వాత ఇది రెండోది కావటంతో.. యోగాను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మోడీ ప్రత్యేక శ్రద్ధ ప్రదర్శిస్తున్నారు.

గత ఏడాది మాదిరే ఈ ఏడాది కూడా మోడీ యోగాడేలో పాలు పంచుకోనున్నారు.  ఇందుకోసం ఆయన పంజాబ్ రాష్ట్ర రాజధాని చంఢీగడ్ ను ఎంచుకున్నారు. మోడీ లాంటి వ్యక్తి యోగా డే కోసం ఒక రాష్ట్రం ఎన్నుకోవటం అంటే అది మామూలు విషయం కాదు. అందులో లెక్క దాగి ఉంటుందన్న విషయాన్ని మర్చిపోకూడదు.

అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న రాష్ట్రాల్లో పంజాబ్ ఒకటన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఈ రాష్ట్రంలో పాగా వేయాలన్న ఆలోచనలో ఉన్న మోడీ.. తన యోగా డేను అక్కడ జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. ఏదైనా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే..ఆ రాష్ట్రం మీద ప్రత్యేక శ్రద్ధ చూపించటం.. తరచూ ఆ రాష్ట్రానికి వెళ్లటం.. అక్కడి వారి మనసుల్ని దోచుకునే ప్రయత్నం చేయటం తెలిసిందే. ఎన్నికల ప్రక్రియ షురూ కావటానికి ఆరు నెలల ముందే ఆయన ఇలాంటివి చేస్తుంటారు. చండీగఢ్ లోయోగా డే కూడా అలాంటిదేనని చెప్పక తప్పదు.
Tags:    

Similar News