ట్రంప్-మోడీ..భేటీ తేదీ ఖ‌రారైంది

Update: 2017-06-12 15:38 GMT
భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. వ‌చ్చే నెల 25 - 26 తేదీల్లో మోదీ అమెరికాలో పర్యటించనున్నారు. అమెరికాకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ తో జూలై 26న మోడీ భేటీ అవుతార‌ని వైట్‌ హౌజ్ వెల్ల‌డించింది. ట్రంప్ అమెరికా అధ్య‌క్షుడిగా ఎన్నికైన‌ తర్వాత మోడీ తొలిసారిగా అక్కడికి వెళ్తున్నారు. ట్రంప్ ఆహ్వానం మేరకు యూఎస్ వెళ్లనున్న మోడీ.. పలు కీలక అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. కొన్ని ముఖ్యమైన ఒప్పందాలు కూడా చేసుకోనున్నట్లు తెలుస్తోంది.

హెచ్1బీ వీసా నిబంధనలు కఠినతరం చేయడంతో భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యలపై అమెరికా అధ్య‌క్షుడితో  ట్రంప్ వద్ద చర్చించే అవకాశం ఉంది. ఇప్ప‌టికే భార‌తదేశానికి చెందిన ప‌లు పారిశ్రామిక సంఘాల ప్ర‌తినిధులు ట్రంప్ స‌ర్కారు నిర్ణ‌యాల‌ను అధ్య‌య‌నం చేసి ఒక నివేదిక రూపొందించిన‌ట్లు స‌మాచారం. ప్ర‌ధాన‌మంత్రి అమెరికా ప‌ర్య‌ట‌న‌లోగా ఈ నివేదిక‌ను స‌మ‌ర్పించి అమెరికా అధినేత‌తో చ‌ర్చించేలా కోర‌నున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రోవైపు వాషింగ్టన్‌ లో ప్రవాస భారతీయులతో మోడీ సమావేశం కానున్నారు. ఈ క్రమంలో మోడీ రాక కోసం ప్రవాస భారతీయులు ఎదురుచూస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News