పెద్దనోట్ల రద్దు నిర్ణయం ప్రకటించిన అనంతరం దేశం మొత్తం ప్రధాని నిర్ణయాన్ని స్వాగతించిన సంగతి తెలిసిందే. అయితే రోజులు గడిచేకొద్దీ - సమస్యలు పెరిగే కొద్దీ - ఈ విషయంపై ప్రభుత్వానికున్న సీరియస్ నెస్ - సామాన్యుడి సమస్యలపై స్పందించిన తీరు చూసి ఆ సమర్ధన సన్నగిల్లుతున్న సంగతి తెలిసిందే! ఈ క్రమంలో మోడీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయానికి వ్యతిరేకత కూడా తీవ్రమవుతుందనే కథనాలు జాతీయ మీడియాలో మొదలైపోయాయి. ఈ క్రమంలో ప్రతిపక్షాలు కూడా ఈమద్య కాలంలో ఎన్నడూ ఉద్యమించని స్థాయిలో స్పందించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా నోట్ల రద్దు నిర్ణయంపై మోడీ భార్య జశోద బెన్ స్పందించారు.
నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ భార్య జశోద బెన్ స్వాగతించారు. రాజస్థాన్ లో జరిగిన ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె ఈ విషయంపై స్పందించారు. దేశాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని ఇలాగే కొనసాగించాలని ఆమె అభిలషించారు. ఇదే క్రమంలో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం దేశంలోని నల్లధనాన్ని, అవినీతిని నిర్మూలిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన ఆమె, విదేశాల్లో దాచిన నల్లధనాన్ని కూడా ఈ నిర్ణయం వెనక్కు రప్పిస్తుందని వ్యాఖ్యానించారు. అలాగే మోడీ నేతృత్వంలోని కేంద్రం పనితీరుపై స్పందించిన ఆమె "పరిపాలన సంతృప్తికరంగా ఉంది" అని అన్నారు.
ఏది ఏమైనా... మోడీ చేసిన పనికి, ఆయన తీసుకున్న నిర్ణయానికి జశోద బెన్ నుంచి మద్దతు రావడం సంతోషించాల్సిన విషయమని, ఆమె కూడా వ్యతిరేకంగా స్పందించి ఉంటే ప్రతిపక్షాలకు మరో అవకాశం దొరికేదని పలువురు అభిప్రాయపడుతున్నారు!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/