చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ తో శిఖరాగ్ర సదస్సు కోసం తమిళనాట అడుగుపెట్టిన ప్రధాని నరేంద్ర మోదీ తమిళ తంబీ మాదిరి అదిరిపోయేటి లుక్కులోకి మారిపోయారు. ఎక్కడికెళ్లినా తనదైన మార్కు వస్త్రధారణలోకి మారిపోయే మోదీ... తమిళనాడులో అడుగుపెట్టిన సందర్భంగా తమిళుల సంప్రదాయ వస్త్రధారణ పంచెకట్టులోకి మారిపోయారు. తెల్లటి పంచెతో పాటు దానికి సరిపడే తెల్లటి చొక్కా - ఆ చొక్కాపై ఎడమ వైపున బార్డర్ తో కూడిన కండువాతో అచ్చం తమిళ తంబీ లుక్కులోకి దిగిపోయారు. ఈ వస్త్రధారణతో ఇప్పటిదాకా మోదీ ఎన్నడూ కనిపించలేదనే చెప్పాలి. తొలిసారి పంచెకట్టులోకి మారిపోయిన మోదీ... అటు తమిళనాడు వాసులతో పాటు ఇటు యావత్తు దేశ ప్రజల దృష్టినీ ఆకట్టుకున్నారనే చెప్పాలి.
ఇదిలా ఉంటే... మోదీతో భేటీ కోసం జిన్ పింగ్ శుక్రవారం మధ్యాహ్నం చెన్నై ఎయిర్ పోర్టులో ల్యాండయ్యారు. ఆ వెంటనే కాస్తంత సేపు విశ్రాంతి తీసుకున్న జిన్ పింగ్... ఆ తర్వాత నేరుగా మహాబలిపురం చేరుకున్నారు. అప్పటికే మహాబలిపురం చేరుకున్న మోదీ... జిన్ పింగ్ కు తమిళనాడు సంప్రదాయ వస్త్రధారణలోనే ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత పంచెకట్టులోనే జిన్ పింగ్ ను వెంటేసుకుని షోర్ ఆలయానికి చేరుకున్న మోదీ... ఆలయంలో కలియదిరిగారు. ఈ సందర్భంగా షోర్ ఆలయ విశేషాలను జిన్ పింగ్ కు మోదీ స్వయంగా వివరించారట.
ఇక శుక్రవారంతో పాటు శనివారం కూడా మహాబలిపురంలోనే బస చేయనున్న మోదీ, జిన్ పింగ్ లు భారత్, చైనా ద్వైపాక్షిక సంబంధాలపై సుదీర్ఘ మంతనాలు సాగించనున్నారు. తాను ఎక్కడికి వెళ్లినా... సదరు ప్రాంతానికి చైనాతో కలిగిన సంబంధాల గురించి తెలుసుకోవడం అంటే జిన్ పింగ్ ను ఇష్టమట. ఇదే విషయాన్ని గ్రహించిన మోదీ... జిన్ పింగ్ ను ఈ సారి మహాబలిపురానికి తీసుకుని వెళ్లారట. మహాబలిపురాన్ని ఏలిన పల్లవ రాజులు... వారి హయాంలో సముద్ర మార్గం మీదుగా చైనాతో వాణిజ్య సంబంధాలను నెరిపారట. ఈ విషయాలను జిన్ పింగ్ కు స్వయంగా మోదీనే వివరించారట. జిన్ పింగ్ తో భేటీ ఎలా ఉన్నా.. తమిళనాట అడుగుపెట్టిన వెంటనే లుంగీలోకి దిగిపోయిన మోదీ మాత్రం తంబీలను ఉబ్బితబ్బిబ్బయ్యేలా చేశారని మాత్రం చెప్పక తప్పదు.