ఇటీవల కాలంలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అందరి నోళ్లలో నానుతోంది. పలు కేసులను ఎన్‌ఐఏ విచారిస్తుండటమే ఇందుకు కారణం. ఇదే క్రమంలో ఎన్‌ఐఏ పేరుతో కేటుగాళ్లు చెలరేగిపోతున్నారు. ఒక వ్యక్తి ఎన్‌ఐఏ అధికారినంటూ పలువురిని బెదిరిస్తూ ప్రజల నుంచి డబ్బులు దండుకుంటున్న ఘటన తెలంగాణలోని వరంగల్‌లో కలకలం రేపింది.
ఈ ఘటన పూర్తి వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి వెల్లడించారు. వివరాల్లోకెళ్తే.. తెలంగాణలోని నల్లగొండ జిల్లా అదిసర్లపల్లి మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన నార్ల నరేష్ ఇంటర్ వరకు చదివాడు. ప్రస్తుతం దూరవిద్య విధానంలో డిగ్రీ చదువుతున్నాడు. ఇదే సమయంలో జల్సాలకు అలావాటు పడిన నరేష్ సులభంగా డబ్బు సంపాదించడంపై దృష్టిపెట్టాడు.
ఈ క్రమంలో నిందితుడు నరేష్ ఆర్మీ యూనిఫామ్, ఎయిర్ పిస్తోల్ ను కోనుగోలు చేశాడు. అంతేకాకుండా నకిలీ గుర్తింపు కార్డును తయారు చేసి గ్రామంలో ఆర్మీలో పనిచేస్తున్నట్లు గ్రామస్తులకు బిల్డప్ ఇచ్చాడు. అంతేకాకుండా తన గ్రామంలో చదువుకున్న యువతకు నేవీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువరిని బురిడీ కొట్టించాడు. ఇలా ఐదుగురు వ్యక్తుల నుండి ఐదు లక్షల రూపాయల చొప్పున వసూలు చేశాడు. వారిని శిక్షణ పేరుతో మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలోని వైష్ణవి కెరీర్ ఫౌండేషన్లో చేర్పించాడు. అయితే అక్కడికి వెళ్లాక తాము మోసపోయినట్లుగా గుర్తించిన సదరు ఐదుగురు యువకులు నిందితుడి తల్లిదండ్రులను నిలదీయడంతో తమ కొడుకు చేతిలో మోసపోయిన యువకులకు వారు తిరిగి డబ్బులు చెల్లించారు.
అయినా తన బుద్ధులు మార్చుకోని నిందితుడు నరేష్ నకిలీ ఎన్‌ఐఏ అధికారి అవతారం ఎత్తాడు. ఈ క్రమంలో నేలపట్ల రాజేష్, బాబు అనేవారితో పరిచయం పెంచుకుని.. వారికి ఎన్‌ఐఏలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించాడు. వారితో కలసి దందాలకు దిగాడు. ఈ క్రమంతో నిందితుడు వరంగల్ కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాతో సంబంధాలు ఉన్నాయని తన దగ్గర ఉన్న పిస్తోల్‌తో బెదిరింపులకు గురి చేశాడు. వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేశాడు. ఇవ్వకపోతే ఉగ్రవాదుల కింద కేసులు నమోదు చేస్తానని బెదిరించాడు.
దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు అందుబాటులో వున్న టెక్నాలజీని వినియోగించుకుని నిందితుడు నరేష్‌ను గుర్తించారు. కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు వద్ద వాహన తనీఖీలు నిర్వహిస్తుండగా ద్విచక్ర వాహనంపై వస్తున్న క్రమంలో అతడిని పోలీసులు ఆపారు. అతడి వద్ద ఉన్న బ్యాగును తనీఖీ చేయగా దానిలో ఆర్మీ యూనిఫాం, ఎయిర్ పిస్తోల్ ఉన్నాయి. వీటిని స్వాధీనం చేసుకుని అతని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. గతంలోనూ నిందితుడు జగిత్యాల జిల్లాలోను ఇదే తరహలో నేరాలకు పాల్పడటం గమనార్హం
నిందితుడు నరేష్ నుండి పోలీసులు ఆర్మీ యూనిఫామ్, ల్యాప్ ట్యాప్, నకిలీ గుర్తింపు కార్డు, ఎయిర్ రైఫిల్, రెండు ద్విచక్రవాహనాలు, ఒక సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.