ఇవాల్టి రోజున సెల్ఫీని తీసుకోని వారుండరు. అందుకు తగ్గట్లే ప్రఖ్యాత అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తాజాగా సరికొత్త యాప్ ను విడుదల చేసింది.భూమి మీద ఉన్న అద్భుతాల్ని ఎదో రకంగా సెల్ఫీలు తీసుకోవచ్చు. కానీ.. అంతరిక్షంలో.. సాధ్యమే కాదు. అయితే.. అదేమీ అసాధ్యం కాదన్నట్లుగా నాసా తాజాగా విడుదల చేసిన సరికొత్త యాప్ ఈ కోరికను తీర్చేస్తుంది.
నక్షత్ర మండలాల వెలుగుల నడుమ సెల్ఫీ తీసుకునే అవకాశాన్ని కల్పిస్తూ.. స్పిట్జర్ స్పేస్ పేరుతో యాప్ ను విడుదల చేసింది. వర్చువల్ రియాలిటీ సాంకేతికతతో పని చేసేలా ఈ యాప్ ను తయారు చేశారు. దీని సాయంతో సెల్ఫీలు తీసుకుంటే.. మన వెనుక గెలాక్సీలు కనిపిస్తాయి.
సామాన్యులకు సాధ్యం కాని అంతరిక్ష ఫోటోల్ని మనకు మనంగా సెల్ఫీలు తీసుకునేందుకు వీలుగా అభివృద్ధి చేసిన ఈ యాప్ సెల్ఫీ ప్రియులకు సరికొత్త అనుభవాన్ని ఇస్తుందనటంలో సందేహం లేదు. కళ్లను కట్టిపడేసే 30 నక్షత్ర మండలాల చిత్రాలు ఈ యాప్ లో ఉన్నాయి. రానున్న రోజుల్లో ఇతర టెలిస్కోప్ లు తీసిన చిత్రాలను వీటికి జత చేస్తామని పరిశోధకులు వెల్లడించారు.
నాసా మరో యాప్ ను కూడా విడుదల చేసింది. ఎక్సో ప్లానెట్ ఎక్స్ కర్షన్ వర్చువల్ రియాలిటీ యాప్ గా పేరు పెట్టిన ఈ యాప్ లో ట్రాపిస్ట్ 1లో భూమిని పోలిన ఏడు గ్రహాలు కనిపిస్తాయి. దీని సాయంతో ఆ ఐదు గృహాలను చుట్టి వచ్చే అద్భుతమైన అనుభూతి ఈ యాప్ తో సొంతం చేసుకోవచ్చు. మరిక ఆలస్యం ఎందుకు.. ఈ యాప్ లను ట్రై చేసి.. మీ సెల్ఫీ లిస్టులో అరుదైన ఫోటోల్ని పెట్టేసుకోండి.