2000వ సంవత్సరంలో భూమి అంతమైపోతుందని ఒకరంటే... మయన్మార్ కేలెండర్ ప్రకారం 2012 డూంస్ డే అని - అనంతరం భూమి నాశనం అని ఇలా రకరాకల పుకార్లు షికారు చేస్తుంటాయి. దక్షిణాఫ్రికాలోని గిరిజనుల నమ్మకం ప్రకారం భూమికి అతిపెద్ద ప్రమాధం ఉందని మరొకరు చెబుతుంటారు. చైనా కాలెండర్ ప్రకారం చూస్తే మరో ప్రమాధం ఉందని ఇంకొకాయన ముందుకొస్తాడు. ఈ రేంజ్ లో ఎవరికి తోచిన స్థాయిలో వారు రూమర్స్ సృష్టిస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా సాక్షాత్తూ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ - నాసా పేరుతో ఒక వార్త వైరల్ అవుతుంది.. భూమి మీదున్న వారికి కలవరపాటుకు గురిచేస్తోంది.
ఈ వార్త ఏమిటంటే... నవంబర్ 15 నుంచి 30 వరకు భూమి మొత్తం చీకటిమయం అవుతుందట, దీనికి సంబంధించిన పూర్తి వవరాలు అమెరికా అధ్యక్షుడు ఒబామాకు నాసా చీఫ్ వెయ్యి పేజీల రిపోర్టును కూడా సమర్పించాడట. ఇది ఏమాత్రం నమ్మశక్యంగా లేకపోయినా, మరి కొంతమందికి హాస్యంగా అనిపించినా... "ది బోర్ డ్ మైండ్" అనే వెబ్ సైట్ కొన్ని రోజుల క్రితం ఈమేరకు ఒక కథనం ప్రచురించింది. ఆ కథనం ప్రకారం... ఈ ఏడాది నవంబర్ 15 నుంచి 30 వరకూ పదిహేను రోజుల పాటు భూమి చీకట్లోకి వెళుతుందట. స్వయంగా నాసా సైంటిస్టులే ఈ విషయం చెప్పారని ఆ వెబ్‌సైట్ ప్రచురించింది. దీంతో పాటు సమయాలను కూడా చెబుతున్న ఆ వెబ్ సైట్... నవంబర్ 15వ తేదీ తెల్లవారుజామున 3 గంటల నుంచి నవంబర్ 30 సాయంత్రం 4.45 వరకూ ఉంటుందని, ఈ ఉత్పాతాన్ని నవంబర్ "బ్లాక్ అవుట్"గా పిలుస్తారని రాసుకొచ్చింది.
నాసా శాస్త్రవేత్తలు చెప్పారని చెబుతున్న ఈ కథనం ప్రకారం... సౌర వ్యవస్థలో శుక్ర, గురు గ్రహాల మధ్య జరిగే ఖగోళ పరిణామాల వల్లే ఈ బ్లాకవుట్ సంభవిస్తుందని శాస్త్రవేత్తలు చెప్పారట. ఆ సమయంలో గురుడు, శుక్రుడు పరస్పరం చాలా దగ్గరగా వస్తాయని, ఈ సమయంలో శుకౄడు, గురుడి కన్నా పది రెట్లు ఎక్కువ ప్రకాశవంతంగా మారుతాడట. ఈ చర్యవల్ల శుక్రుడిలో వేడి బాగా పెరిగి వాయువులు విడుదలవుతాయట. దీంతో సౌరవ్యవస్థలో ఇంతకు ముందెప్పుడూ లేనంతగా హైడ్రోజన్ వాయువు అలుముకుంటుదని, దీంతో సూర్యుడి ఉపరితలంపై ఉష్ణగ్రత ఒక్కసారిగా 9000 డిగ్రీల కెల్విన్ కు చేరుకుంటుందని, దాని ప్రభావంతో సూర్యుడు కూడా కాస్త నీలం రంగులోకి మారిపోతాడని చెబుతుంది. ఈ అత్యధిక ఉష్ణోగ్రతకు లోన ఏర్పడిన నీలి రంగునుంచి సూర్యుడు మరలా యథాస్థితికి రావాలంటే 14 రోజుల సమయం పడుతుందని ఆ వెబ్ సైట్ తన కథనంలో పేర్కొంది.
అయితే ఈ రూమర్ పై స్పందించిన ఖగోళ శాస్త్రవేత్తలు అంతగా భయపడాల్సిన పనేమీ లేదని తేల్చి పారేస్తున్నారట. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత సూర్యుడు కొంచెం కొంచెంగా తన ప్రకాశాన్ని కోల్పోతున్నట్లు అనిపిస్తుందని.. ఈ ప్రక్రియ నిజంగానే జరిగితే భూమిపై 6 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుతుందే తప్ప అంతకుమించి ఎలాంటి ప్రభావం ఉండదని.. నవంబర్ నెలలో ఎలాగో చలి ఎక్కువాగా ఉంటుంది కాబట్టి ఆమాత్రం ఉష్ణోగ్రత పెరిగినా ఏం పర్లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారట!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/