కోరికలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి. కానీ, అన్ని కోరికలు ఒకేలా ఉండవు. ఇకపోతే , నాసాలో ట్రైనింగ్ తీసుకుంటున్న ఆ సైంటిస్ట్ కు కూడా ఓ ఫాంటసీ ఉంది. అదేమిటంటే .. చంద్రుడిపై సెక్స్ చేయాలనేది అతడి కోరిక. అయితే ఆ కోరిక తీరడం అసాధ్యమనే విషయం నాసా లాంటి సంస్థలో పనిచేస్తున్న అతడికి తెలుసు. అందుకే తన కోరికను మరో రకంగా తీర్చుకున్నాడు. అయితే , ప్రస్తుతం జైలు గోడల మధ్య మగ్గుతున్నాడు. ఆ సైంటిస్ట్ పేరు థాడ్ రాబర్ట్స్. ప్రస్తుతం నాసాలో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. మార్స్ గ్రహంపైకి పంపించాలనుకుంటున్న వ్యోమగాముల్లో ప్రాబబుల్స్ లిస్ట్ లో ఒకడు.
అంతటి గొప్ప పొజిషన్ లో ఉన్న థాడ్, చేసిన ఒకే ఒక్క పాడుపని వల్ల ఆకాశంలోకి వెళ్లాల్సిన వాడు జైల్లో నాలుగు గోడల మధ్య ఉన్నాడు. థాడ్ రాబర్ట్స్ కు ఓ గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఆమెతో చంద్రుడిపై సెక్స్ చేయాలనేది థాడ్ కోరిక. దాని కోసం అతడు ఏం చేశాడంటే, చంద్రుడి పై నుంచి సేకరించిన అరుదైన రాళ్లను దొంగిలించాడు. వాటిని మంచంపై వేసి ప్రియురాలితో సెక్స్ చేశాడు. చంద్రుడిపై శృంగారం చేసిన అనుభూతిని అలా పొందాడు. హూస్టన్ లో ఉన్న నాసా ల్యాబ్ నుంచి దొంగిలించిన ఆ రాళ్లను కేవలం అతడు శృంగారం కోసం మాత్రమే వాడలేదు. వాటిని అమ్ముకొని సొమ్ము చేసుకోవాలని కూడా భావించాడు.
మార్కెట్లో వాటి విలువ ఇండియన్ కరెన్సీ ప్రకారం 157 కోట్ల రూపాయలు. అలాంటి విలువైన రాళ్లను గ్రాము 5వేల డాలర్లకు అమ్మేందుకు బెల్జియంకు చెందిన ఓ ఖనిజ శాస్త్రవేత్తతో బేరం కుదుర్చుకున్నాడు. కానీ బెల్జియంకు చెందిన ఆ శాస్త్రవేత్త మాత్రం ఎఫ్ బీ ఐకి సమాచారం ఇచ్చి, థాడ్ ను పట్టించాడు. ఇక చంద్రుడి నుంచి సేకరించిన ఆ రాళ్ల విషయానికొస్తే.. ఇప్పుడా రాళ్లు ఎందుకు పనికిరావని శాస్త్రవేత్తలు తేల్చారు. 30 ఏళ్ల కిందట చంద్రుడి నుంచి సేకరించిన ఆ అరుదైన రాళ్లను థాడ్, అతడి ప్రియురాలు మలినం చేశారని ప్రయోగాలకు అవి ఇక ఎంతమాత్రం ఉపయోగపడవని తేల్చారు.