దేశంలో ఇన్ని నగరాలు ఉంటే దేశ ఆర్థిక రాజధాని ముంబయి.. కర్ణాటకలోని మంగళూరు.. ఏపీలోని కాకినాడ సిటీలు మాత్రమే ప్రమాదంలో ఉండటం ఏమిటి? ఇంతకీ అదెలాంటి ప్రమాదం? అన్న సందేహాలకు సమాధానం తెలియాలంటే చదవాల్సిందే. సముద్ర తీర నగరాల్లో ఉండటానికి ఎక్కువ మంది మక్కువ ప్రదర్శిస్తుంటారు. సముద్ర తీర నగరాల్లో చెమట.. ఉక్కపోత లాంటి కొన్ని ఇబ్బందులున్నా.. ప్రకృతి అందాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటాయి.
దేశంలో అలాంటి నగరాల్లో ముంబయి.. మంగళూరు ముందుంటాయి. అయితే.. రానున్న రోజుల్లో ఈ రెండు నగరాలకు ముప్పు వాటిల్లనుందని హెచ్చరిస్తోంది అమెరికా అంతరిక్ష సంస్థ నాసా. గ్లోబల్ వార్మింగ్ పుణ్యమా అని ఈ రెండు నగరాల్లో సముద్ర మట్టం పెరిగి.. నగర జీవనానికి ముప్పు వాటిల్లుతుందని చెప్పింది. మన దేశంలో ఈ రెండు నగరాలతో పాటు అమెరికాలోని ప్రసిద్ధ నగరమైన న్యూయార్క్ మహానగరానికి ఇలాంటి ప్రమాదమే పొంచి ఉందని పేర్కొంది.
రాబోయే వందేళ్లలో మంచు కరగటం కారణంగా మంగళూరు వద్ద నీటి మట్టం 15.98 సెంటీమీటర్లు.. ముంబయి వద్ద 15.26 సెంటీమీటర్లు.. న్యూయార్క్ వద్ద 10.65 సెంటీమీటర్ల మేర నీటి మట్ట పెరుగుతుందని.. దీంతో ఆయా నగరాలకు ముప్పు తప్పదని చెబుతున్నారు. మంచు కరగటం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ముప్పు వాటిల్లే నగరాలను తెలుసుకునేందుకు గ్రేడియంట్ ఫింగర్ ప్రింట్ మ్యాపింగ్ అనే పరకరం ఆధారంగా డేంజర్లో ఉన్న నగరాల్ని తేల్చారు. మంచు కరగటం ద్వారా ముంచుకొచ్చే ప్రమాదం ఎన్ని సముద్ర తీర నగరాల్లో ఉంటుందన్న విషయంపై 293 సముద్ర తీర నగరాలపై పరిశోధన నిర్వహించి డేంజర్లో ఉన్న నగరాల లిస్ట్ రెఢీ చేశారు. దేశంలో ముంబయి.. మంగళూరు తర్వాత ఏపీలోని కాకినాడకు కూడా ముప్పు పొంచి ఉందని తేలింది.
ఇదంతా చదవినిప్పుడు మీకో డౌట్ రావొచ్చు. ప్రపంచంలో సముద్ర తీర నగరాలు ఎన్నో ఉన్నాయి. కానీ.. మంచుకరగటం కారణంగా అన్ని సముద్ర తీర నగరాలకు ముప్పు వాటిల్లాలేకానీ కొన్ని నగరాలకు మాత్రమే ఎలా? అని. దీనికి నాసా శాస్త్రవేత్తలు సమాధానం చెబుతున్నారు. గురుత్వాకర్షణ శక్తి కారణంగా మంచు కరిగినప్పుడు భూమి మీద అన్ని నగరాల్లోనూ ఒకేలా నీరు విస్తరించదని చెబుతున్నారు. ఈ లెక్కన మన దేశంలో సముద్ర తీర నగరాలు చాలా ఉన్నా ముప్పు మాత్రం మంగళూరు.. ముంబయి..కాకినాడలకేనని తేల్చారు.