ఈ భూమి పై జనాభా రోజురోజుకి పెరిగిపోయింది. అయితే సైన్స్ పరంగా ఎంతగా అభివృద్ధి చెందినా కూడా మనిషి ప్రాణాలు కాపాడటం అంత సులువేం కాదు అనే సంగతి కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో నిర్దారణ అయింది. కాబట్టి భూమిపై జీవరాశి ఏదైన ప్రమాదం సంభవించి నివశించడానికి అనుకూలంగా లేకపోతే , మనుగడ సాగించడం ఎలా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని మార్స్ గ్రహం పై నాసా పరిశోధనలు చేస్తోంది నాసా. ఎప్పటికైనా మార్స్ మీదకు మనుషులను పంపి అక్కడ కాలనీలు ఏర్పాటు చేసి నాగరికతను విస్తరింపజేయాలని ఆలోచన చేస్తోంది.
ఇందులో భాగంగా భూమి పై మార్స్ గ్రహంలో ఉండే విధమైన కృత్రిమ వాతావరణాన్ని నాసా సృష్టించింది. అక్కడ సంవత్సరంపాటు మనుషులను ఉంచి మార్స్ మీదకు వెళ్లినపుడు మనుషులు ఎలా ఉంటారు అనే విషయాలను తెలుసుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. మార్స్ పై మీరు నివాసం ఉంటారా, అక్కడి కాలనీల్లో సరికొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్నారా..? అయితే దాని కోసం అక్కడ కొత్తగా కాలనీలు కూడా ఏర్పాటు కాబోతున్నాయి. దీనికోసం ఇప్పటికే అనేక స్పేస్ కంపెనీలు ప్రణాళికలు కూడా రచిస్తున్నాయి. వారి ప్రణాళికలే కార్యరూపం దాల్చితే మానవ చరిత్రలోనే అద్భుతమైన మార్పు సంభవిస్తుంది.
గ్రహాంతర నివాసం కలసాకారం చేసుకునే క్రమంలో పలు దేశాలు పలు ప్రయోగాలు చేపడుతున్నాయి. అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఈ ప్రయోగాల్లో మరో ముందడుగు వేసింది. ప్రధానంగా అంగారకగ్రహంపై మానవ నివాసం సాధ్యమవుతుందా, లేదా అనేదే ప్రధాన ప్రశ్న. ఈ క్రమంలోనే అంగారక వాతావరణంలో మనిషి జీవించగలరా లేదా అనే ఆలోచన అందరిలోనూ ఉంది. అయితే, ప్రస్తుతం భూమిపైనే అంగారక గ్రహ వాతావరణాన్ని తయారు చేస్తోంది నాసా. ఇందులో భాగస్వాములు కావడం కోసం ప్రత్యేకంగా ప్రజల నుంచి దరఖాస్తులను సైతం ఆహ్వానిస్తోంది.
ఈ దరఖాస్తుల ద్వారా ఎంపిక చేసిన వారిపై నాసా ఏడాది పాటు ప్రయోగం చేయనుంది. ఎంపిక చేసుకున్నవారు ఈ కృత్రిమ అంగారక వాతావరణంలో ఉంటూ ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయో, వాటికి ఎలా సిద్ధమవ్వాలో ఎప్పటికప్పుడు నమోదు చేస్తూ వారిపై నాసా అధ్యయనం చేస్తుంది. ఈ అధ్యయనంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించి అంగారకుడిపై నివాసానికి అన్ని విధాలుగానూ మానవ జాతిని సిద్ధం చేసేందుకు నాసా ప్రయత్నిస్తోంది. హ్యూస్టన్‌లోని జాన్సన్ అంతరిక్ష కేంద్రంలోని ఓ ప్రదేశంలో మార్స్ డ్యూన్ ఆల్ఫా అనే ప్రత్యేకమైన ఆవాసం ఏర్పాటు చేసింది. 1700 చదరపు విస్తీర్ణంలో ఈ కృత్రిమ మార్స్ వాతావరణాన్ని ఏర్పాటు చేసింది. ఈ వాతావరణంలోకి ప్రవేశించిన తరువాత వారి శరీరంలో వచ్చే మార్పులను, సమస్యలను ముందుగానే తెలుసుకోవాలని నాసా నిర్ణయం తీసుకుంది. ఈ అవకాశం కేవలం అమెరికాలో శాశ్వత నివాసం ఉంటున్న వారికి మాత్రమే అని నాసా వెల్లడించింది. .