అల్లంత దూరాన ఉన్న అంతరిక్షంలోకి వ్యోమగాములు వెళ్లి రావటం తెలిసిందే. ఇందుకోసం జరిగే కసరత్తు అంతా ఇంతా కాదు. అందుబాటులోకి వచ్చిన శాస్త్రసాంకేతికతతో పాటు.. అంతరిక్ష పరిశోధనల ఖర్చు భారాన్ని తగ్గించేందుకు వీలుగా అంతరిక్ష టూర్ ప్యాకేజీలను సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే.
మరో ఏడాదిలో అంతరిక్ష ప్రయాణానికి వీలుగా టూర్ ప్యాకేజీలను సిద్ధం చేయనున్నట్లుగా నాసా ప్రకటించింది. ఇందులో భాగంగా 30 రోజుల పాటు ప్రైవేటు వ్యోమగాములు అంతరిక్షంలో గడిపేందుకు ప్రత్యేక ప్రాజెక్టు సిద్దం చేసినట్లుగా చెబుతున్నారు. కక్షలో తిరుగుతున్న ఉపగ్రహంలో ఒక రాత్రి గడపాలనుకునే వారికి రూ.24 లక్షలు చొప్పున వసూలు చేస్తామని పేర్కొన్నారు.
ఒక్కో అంతరిక్ష పర్యటనకు ఒక్కొక్క వ్యక్తికి రూ.400 కోట్ల వరకు ఖర్చు అవుతుందని చెబుతున్నారు. అంతరిక్ష కేంద్రం నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎదురవుతున్న ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమించేందుకు వీలుగా ఈ ప్రైవేట్ అంతరిక్ష టూర్ ప్యాకేజీ ప్లాన్ ను సిద్ధం చేశారు. ప్రస్తుతం ఈ ఏడాదిలో రెండుసార్లు ప్రైవేటు వ్యోమగాములను అనుమతించే వీలుందని నాసా పేర్కొంది.
ఇదిలా ఉంటే.. అమెరికాకు చెందిన వ్యాపారవేత్త డెన్నిస్ టిటో.. తొలిసారి అంతరిక్షంలోకి వెళ్లి వచ్చిన యాత్రికుడిగా పేరొందారు. ఆయన తన ట్రిప్ వెళ్లి రావటం కోసం రూ.138 కోట్లు ఖర్చు చేశారు. రానున్న రోజుల్లో అంతరిక్ష ప్యాకేజీలను నాసాతో పాటు.. స్పేస్ ఎక్స్ అనే సంస్థ సైతం విపరీతమైన ప్రయత్నాలు చేస్తోంది. వీరిద్దరి ప్రాజెక్టులు వచ్చే ఏడాదికి అందుబాటులోకి రానున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడెలా అయితే హాలీడే డెస్టినేషన్ల కింద కొత్త కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయో.. రానున్న రోజుల్లో అంతరిక్షానికి వెళ్లి వచ్చానని చెప్పే వారి సంఖ్య పెరగటం ఖాయమని చెప్పకతప్పదు.