రాజకీయాలు - మీడియా...అవిభాజ్య కవలల వంటివి. కొందరు నాయకులకు స్వతహాగానే మీడియా సంస్థలైన టీవీలు - దిన - వార పత్రికలు ఉన్నాయి. మరికొందరికి బినామీల రూపంలో ఉన్నాయి! కొన్ని పార్టీలకు స్వతహాగా పలు మీడియా సంస్థలు మద్దతు పలుకుతున్నాయి!! అయితే ఇపుడు గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కోసం వార్తాపత్రిక రాబోతోంది.
నేషనల్ హెరాల్డ్ ...ఇటీవలి కాలంలో బాగా పాపులర్ అయిన పదం. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె తనయుడు రాహుల్ గాంధీ లను కోర్టు బాట పట్టించిన కేసు. పత్రికను కాంగ్రెస్ పార్టీ అవసరాల కోసం ప్రారంభించి ఆ తర్వాత సొంత లాభానికి కబేళాకు తరలించారనే ఆరోపణతో కేసులు వేయడంలో దిట్ట అయిన సుబ్రహ్మణ్యస్వామి కాంగ్రెస్ అగ్రనేతలను కోర్టుకు రప్పించారు. ఈ పరిణామాలన్నింటితో కాంగ్రెస్ పెద్దలు హర్ట్ అయ్యారేమో కానీ తాజాగా పత్రికను పునఃప్రారంభించేందుకు సిద్ధమయ్యారు.
హెరాల్డ్ గ్రూప్ ఆఫ్ న్యూస్ పేపర్స్ - అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నేషనల్ హెరాల్డ్ గతంలో ముద్రించేవారు. తాజాగా కేసు, ఇతరత్రా పరిణామాల నేపథ్యంలో వార్తా పత్రికను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించేందుకు ఏజేఎల్ "అసాధారణ సర్వ సభ్య సమావేశం" ఏర్పాటు చేసుకున్నారు. ఏజేఏల్ ను లాభాపేక్ష లేని సంస్థగా మార్పు చేయాలని నిర్ణయించినట్లు నేషనల్ హెరాల్డ్ ప్రచురణకర్తల తరఫున మేనేజింగ్ డైరెక్టర్, కాంగ్రెస్ నాయకుడు కూడా అయిన మోతీలాల్ ఓరా ప్రకటించారు. ఏజేఎల్ అసాధారణ సర్వ సభ్య సమావేశంలో నేషనల్ హెరాల్డ్ వార్తా పత్రికలను తిరిగి ప్రారంభించాలని తీర్మానించినట్లు తెలిపారు. అయితే ఈ నిర్ణయానికి నేషనల్ హెరాల్డ్ కేసుకు ఎటువంటి సంబంధం లేదని ఓరా చెప్పడం మొత్తం ఎపిసోడ్ లో కొసమెరుపు.