ఆరాచకానికి పరాకాష్ఠగా ఈ ఉదంతాన్ని చెప్పక తప్పదు. తెలంగాణ రాష్ట్రంలో పెరిగిన భూమి ధరల నేపథ్యంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెలరేగిపోతున్నారు. వెనుకా ముందు చూడకుండా ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరిస్తున్న వీరి తీరుతో సామాన్యులు.. మధ్యతరగతి వారు దారుణంగా నష్టపోతున్నారు. మిగిలిన వారి కంటే తక్కువ ధరలకు ఆకర్షణీయమైన ప్రచారంతో వల విసరుతూ.. తమ బుట్టలో వేసుకుంటున్నారు. తాజా ఉదంతం ఆ కోవలోకి చెందిందే.
హైదరాబాద్ - బెంగళూరు నేషనల్ హైవే వెంట రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతోంది. దీంతో.. కాసుల కక్కుర్తితో భారీ మోసాలకు దిగుతున్నారు.
అక్రమ లేఔట్లు వేయటం కొత్త విషయం కానప్పటికీ.. ఇప్పటివరకు వెలుగుచూడని కొత్త కోణం బయటకువచ్చింది. జడ్చర్ల బూరెడ్డి పల్లి శివారులో వేసిన రియల్ వెంచర్ లోగుట్టు తెలిసిన వారంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంతటి బరి తెగింపా? అని ఆశ్చర్యపోతున్నారు.
ఎందుకంటే.. ఈ వెంచర్ పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సొరంగం మీదన వేయటమే. ఎత్తిపోతల పథకం 16వ ప్యాకేజీలో బాగంగా జడ్చర్ల మున్సిపాలిటీలోని బూరెడ్డి పల్లి వద్ద సర్వే నెంబర్లు 56, 57, 58, 102-11లో రెండు సొరంగాలు వెళుతున్నాయి.
వీటి నిర్మాణం కోసం ఆ సర్వే నెంబర్లలోని 40 మంది వద్ద భూసేకరణ చేశారు. దీంతో ఈ ప్రాంతమంతా ప్రభుత్వ అధీనంలో ఉంది. ఇలాంటివేళ మొత్తం 60 ఎకరాల్లో ఒక రియల్ సంస్థ వెంచర్ వేసింది. అది కూడా సొరంగాల పైనుంచి. 628 ప్లాట్లను వేసి లావాదేవీల్ని షురూ చేసింది.
అంతేకాదు.. ఇందులోమూడు ఎకరాల్లో ఉన్న మురుగు కుంటను సైతం లేఔట్ కిందకు మార్చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్లాట్లను కొనుగోలు చేసి.. ఇళ్ల నిర్మాణం కోసం బోర్లు వేసుకుంటే.. టన్నెల్ మీద ఒత్తిడి పెరగటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.
అక్రమాలు సహజమే అయినా.. వాటన్నింటికి మించిన రీతిలో ఎత్తిపోతల పథకం సొరంగాల మీద రియల్ వెంచర్ వేసిన వైనం ఇప్పుడు షాకింగ్ గా మారిందన్న విమర్శలు ఉన్నాయి. మరి.. దీనిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.