వాట్సాప్ యూనివర్సిటీని రన్ చేస్తున్న జాతీయ పార్టీ!

Update: 2021-03-09 10:07 GMT
టెక్నాలజీ పుంజుకుంటున్న ఈ రోజుల్లో వాట్సాప్ అందరికీ నిత్యావసరం అయిపోయింది. అన్ని పనులు, వ్యవహారాలు, పలకరింపులు అన్నీ దాంట్లోనే. అసలు వాట్సాప్  లేని మొబైల్ ఇప్పుడు లేదంటే నమ్మండి.. జియో కంపెనీకి చెందిన కీప్యాడ్ మొబైల్ లోనూ వాట్సాప్ యాప్ ను వాడుకునే విధంగా సౌకర్యాన్ని కల్పించారు. అంతటి ప్రజాదరణ పొందిన వాట్సాప్ ను రాజకీయ పార్టీలు తెలివిగా వాడుకుంటున్నారు. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వాట్సాప్ ను యూనివర్సిటీలాగా నడిపిస్తోందని కొందరు వాదిస్తున్నారు. ప్రతీ విషయాన్ని ఈ యాప్ ద్వారా తమ కార్యకర్తలకు చేరవేరుస్తూ ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తుందట.

2014 ముందు ఒకసారి పరిశీలిస్తే.. బీజేపీని అద్వానీ, మురళీ మనోహర్ జోషి లాంటి సీనియర్లు కార్యకర్తల ద్వారా పార్టీని బలోపేతం చేశారు.ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ పార్టీకి సంబంధించిన నిర్ణయాలను తీసుకునేవారు. కానీ 2014 వరకు గుజరాత్ సీఎంగా ఉన్న మోడీకి ప్రశాంత్ కిశోర్ అనే రాజకీయ వ్యూహకర్త పరిచయమయ్యాడు. ఆ తరువాత మోదీ దగ్గరికి వెళ్లి మీరు పీఎం అయ్యే అవకాశాలున్నాయని, బీజేపీ గెలిచేందుకు సహకరిస్తానని చెప్పాడు.

ఆ సమయంలో వాట్సాప్ అంతగా ప్రజాదరణ లేదు. ఇతర సోషల్ మీడియాల ద్వారా ప్రజలను బీజేపీ వైపు మళ్లేటట్లు పార్టీ నాయకుల ద్వారా ప్రచారం చేయించారు. దీంతో 2014లో మోడీ ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి నుంచి ఇతరుల కంటే సోషల్ మీడియానే ఎక్కువగా నమ్ముకున్న మోడీ అందులో వాట్సాప్ ను ఎక్కువగా వాడుతున్నారని అంటున్నారు.

వాట్సాప్ లోని అనేక రకాల ఫీచర్లను కొత్తగా క్రీయేట్ చేసి కంపెనీ వాళ్లకు తెలియకుండా కొన్ని ట్రిక్స్ పెట్టారని అంటున్నారు. దీంతో  పార్టీకి సంబంధించిన సమాచారాన్ని  సామాన్య జనం వరకు సమాచారం అందేలా ఈ వాట్సాప్ ను తయారు చేస్తున్నారన్నారు. అలాగే కొన్ని వర్గాలను విభజించి వారికి సంబంధించిన పోస్టులను పెడుతూ బీజేపీపై నమ్మకం ఏర్పడేలా ప్రచారం చేయిస్తున్నారన్నారు. మొత్తానికి బీజేపీ గెలుపు వెనుక వాట్సాప్ యూనివర్సిటీలా పనిచేస్తుందని అంటున్నారు.
Tags:    

Similar News