మొన్నటి తెలంగాణ ఎన్నికలు సీరియస్‌గా జరుగుతున్న వేళ.. అంత టెన్షన్‌లో అందరికి కామెడీ పంచి తాను అసలు సిసలు కమెడీయన్ అని నిరూపించుకున్నాడు బండ్ల గణేష్. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా 7 ఓ క్లాక్ స్టార్ అంటూ బండ్లకు ఒక గుర్తింపు వచ్చేసింది. ఇప్పుడు ఏపీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో తెలుగు ప్రజలకు తనదైన స్టైల్లో వినోదం పంచుతున్నారు శాంతి దూత కేఏ పాల్. మత బోధకుడిగా జీవితాన్ని ప్రారంభించిన కేఏ పాల్.. వచ్చే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కామెడీ చేస్తున్నారు. అయితే.. అసలు కేఏపాల్ ఎవరు - నిజంగా ఆయన దగ్గర అన్ని డబ్బులున్నాయా - ఆయన చెప్పేవన్నీ నిజాలేనా.. ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు నిర్మాత నట్టికుమార్. ఎందుకంటే కేఏ పాల్ ను గత 25 ఏళ్లుగా చాలా దగ్గరనుంచి చూసిన వ్యక్తి నట్టికుమార్.
“కేఏపాల్ ది మాది ఇంచుమించు దగ్గర ఊళ్లు. ఆయన కుటుంబం చిన్నప్పుడే క్రిస్టయన్ మతం తీసుకుంది. అందుకే కేఏ పాల్ మత ప్రభోధకుడిగా మారారు. ఆ తర్వాత తన బోధనలతో బాగా పాపులర్ అయ్యారు. ఆయనకు దేశవిదేశాల నుంచి ఆహ్వానాలు అందాయి. ఫండ్స్ కలెక్ట్ అయ్యాయి. వివిధ దేశాల అధ్యక్షులు కూడా ఆయన కోసం వెయిట్ చేశారు. సోనియాగాంధీ - వైఎస్ - చంద్రబాబు కూడా కేఏ పాల్ కోసం ఎదురుచూసిన సందర్భాలున్నాయి. ఈ విషయంలో ఆయన చెప్పేవన్నీ నిజాలే. కానీ ఎప్పుడైతే నేనే దేవుడ్ని అని కేఏపాల్ అనడం మొదలుపెట్టారో అప్పటినుంచి ఆయన పతనం మొదలైంది. ఫండ్స్ ఎక్కౌంట్స్ అన్నీ ఫ్రీజ్ అయిపోయాయి. కొన్ని దేశాల్లో ఆయన సేకరించిన ఫండ్స్ ని అక్కడి ప్రభుత్వాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇక ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి కేఏ పాల్ మరింతగా కామెడీ అయిపోయారు. టీవీ ఛానెల్స్ లో ఆయన్ని చూసి యాంకర్లు నవ్వుకుంటున్నారు. బయట ప్రజలు కూడా కమెడీయన్ వచ్చాడని జోకులేసుకుంటున్నారు” అని కేఏ పాల్ గతానికి సంబంధించిన నిజాల్ని ఆవిష్కరించారు నట్టికుమార్.