శిక్షించేందుకు ప్రకృతి సిద్ధమవుతోంది.. ఇలానే కొనసాగితే 2030లో అన్ని దారుణాలు

Update: 2022-04-27 04:30 GMT
ఈ ప్రపంచం ఎవరిది కాదు. ఇందులో ఉండే అందరిది. కానీ.. మనిషి లాంటి దుర్మార్గమైన జీవి తన అవసరాల కోసం.. తన సంతోషం కోసం.. తన విలాసం.. సౌకర్యం కోసం చేసే చేష్టలకు ప్రకృతి ఉడికిపోతూ ఉంటుంది. అయినప్పటికి మిగిలిన జీవులతో పోలిస్తే.. బుద్ది జీవులైన మనిషి తనకున్న స్వార్థంతో మిగిలిన జీవుల మీద అధిపత్యాన్ని చెలాయిస్తూ.. భూమిని మీద గుత్తాధిపత్యాన్ని చెలాయించాలని భావిస్తున్నాడు. ఇలాంటి వాటన్నింటిని చూస్తున్న ప్రకృతి ఉత్తినే కూర్చోదు. తనకు తగ్గట్లు తాను రియాక్టు అవుతూ ఉంటుంది. మనిషి చేసే విధ్వంసాల్నిభరిస్తూ.. భరిస్తూ.. ఒక్కసారిగా బద్దలు కావటం.. దానికి మనిషి ఉక్కిరిబిక్కిరి కావటం తెలిసిందే.

పురాణ కాలం నుంచి చెబుతున్నా మనిషి ప్రవర్తనలో మాత్రం మార్పులు రావటం లేదు. ఆ మాటకు వస్తే ఉండేకొద్దీ మనిషి మరింత ప్రమాదకరంగా మారి.. తనచుట్టూ ఉన్న సహజ వనరుల్ని ధ్వంసం చేసుకుంటూ పోతున్నాడు.

దానికి సంబంధించిన విపరిణామాల్ని అస్సలు పట్టించుకోవటం లేదు. ఇంతకాలం ఎలా ఉన్నా.. ఇక నుంచి మాత్రంజాగ్రత్తగా ఉండాలన్న విషయాన్ని తెలియజేస్తూ.. ఐక్యరాజ్య సమితి సీరియస్ నివేదికను సిద్ధం చేసింది. అందులో రానున్న రోజుల్లో ప్రపంచానికి ఎదురయ్యే సవాళ్లను పేర్కొన్నారు.        

అందులో అన్నింటికంటే భయపెట్టేది.. ఆందోళనకు గురి చేసే అంశం ఏమంటే.. ఇప్పుడు మనిషి అనుసరిస్తున్న ధోరణులే కంటిన్యూ చేస్తే.. 2030 నాటికి ఏడాదికి 560 విపత్తుల్ని మానవాళి ఎదుర్కోవాల్సి వస్తోందని స్పస్టం చేశారు.

2015లో అత్యధికంగా ఏడాదికి 400 విపత్తు ఎదురైతే.. అందుకు ఒకటిన్నర రెట్లు ఎక్కువగా విపత్తులు రానున్న రోజుల్లో మీద పడిపోనుందని చెబుతున్నారు. ఈ సందర్భంగా గతాన్ని గుర్తు చేస్తూ.. 1970-2000 మధ్య కాలంలో ఏడాదికి ఏదో ఒక చోట చొప్పున మొత్తం 90 నుంచి వంద లోపే విపత్తులు రాగా.. ఇప్పుడు మాత్రం భారీ ఎత్తున పెరిగిపోయాయి.

2030 లో ప్రపంచాన్ని వేడి గాలులు చుట్టుముడతాయని.. ఇవి 20012 కంటే మూడు రెట్లు అధికంగా ఉంటాయని.. ప్రపంచవ్యాప్తంగా కరవులు సైతం 30 శాతం పెరుగుతాయని పేర్కొన్నారు. ఇప్పటికైనా మనిషి మేల్కొనాలని.. కష్టం వచ్చినప్పుడు అందరూ ఏకం కావటమే కాదు.. తమకు ఎదురయ్యే పర్యావరణ సవాళ్లను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాల్సిందే. లేకుంటే.. భవిష్యత్తు అంతా బతకలేని పరిస్థితులు నెలకొంటాయన్నది మర్చిపోకూడదు.
Tags:    

Similar News