కరోనా ఎఫెక్ట్..మాస్క్ తో పార్లమెంట్‌ కు హాజరైన మాజీ హీరోయిన్

Update: 2020-03-04 12:30 GMT
కరోనా వైరస్ (కొవిడ్ -19).. ప్రస్తుతం దేశ వ్యాప్తంగానే కాదు.. ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్. ఇప్పటికే కరోనా వైరస్ దెబ్బతో చైనాతో పాటు భారత్ సహా అన్ని దేశాలు గజ గజ వణికిపోతున్నాయి. కరోనా వైరస్ దెబ్బకు దేశాలకు దేశాలే ఆర్ధికంగా కుదేలవుతున్నాయి. ఈ కరోనా ఎఫెక్ట్‌ భారత పార్లమెంట్‌ కు పాకింది. చాలా మంది ఎంపీలు కరోనా ఎఫెక్ట్‌ తో మాస్క్‌లతో పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతున్నారు.

తాజాగా పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సమావేశాలకు హీరోయిన్ , ఎంపీ అయిన నవనీత్ కౌర్ రాణాముఖానికి మాస్క్ వేసుకొని హాజరైంది. రెండో విడత బడ్జెట్ సమావేశాలకు హాజరవుతున్న ఈమెను ఇలా చూసి దగ్గరున్న ఇతర ప్రజాప్రతినిధులు, పార్లమెంట్ సిబ్బంది ఆశ్చర్యపోయారు. అయితే కరోనాపై ప్రభుత్వాన్ని మరింత అప్రమత్తం చేసేందుకే నవనీత్ కౌర్ ఇలా ముఖానికి మాస్క్ ధరించి వచ్చిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఇకపోతే , చైనాలోని వూహాన్ లో పుట్టి ఇప్పుడు సుమారు 80 దేశాలకు వ్యాపించిన ఈ  వైరస్ .. రోజురోజుకీ మరింతగా విజృంభిస్తోంది. దీని నివారణకు ప్రపంచ దేశాల ప్రభుత్వాలు అన్ని చర్యలూ తీసుకుంటున్నప్పటికీ.. వివిధ  దేశాల నుంచి వచ్ఛే టూరిస్టుల కారణంగా ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా జరుగుతోంది.  ఈ వైరస్ కారణంగా ఇప్పటికే మూడు వేలమందికి పైగా మృత్యువాత పడ్డారు. కాగా , ఈ వైరస్ ప్రభావం ఇండియా లో ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది అని చెప్పాలి. దీనితో అందరూ తగిన జాగ్రత్తలు పాటించాలని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది.


Tags:    

Similar News