ష‌రీఫ్..ఆయ‌న కుమార్తెకు జైల్లో బీ క్లాప్ వ‌స‌తులు!

Update: 2018-07-15 04:28 GMT
పాకిస్థాన్ లాంటి దేశంలో మాజీ ప్ర‌ధానిని.. ఆయ‌న కుమార్తెను జైల్లో ప‌డేసే అవ‌కాశం ఉందా? అంటే.. ఉంద‌న్న విష‌యం మ‌రోసారి రుజువైంది. మాజీ  ప్ర‌ధాని న‌వాజ్ ష‌రీఫ్.. ఆయ‌న కుమార్తె మ‌రియ‌మ్‌ ల‌ను రావ‌ల్పిండిలోని అదియాలా జైలుకు త‌ర‌లించిన సంగ‌తి తెలిసిందే.

అవెన్ ఫీల్డ్ కేసులో అరెస్ట్ అయిన వారు ప్ర‌స్తుతం జైల్లో ఉన్నారు.లాహోర్ ఎయిర్ పోర్ట్ లో విమానం దిగిన వెంట‌నే ఈ తండ్రి.. కూతురిని అదుపులోకి తీసుకున్న అధికారులు వెంట‌నే విమానంలో రావ‌ల్పిండికి త‌ర‌లించారు. అనంత‌రం వారికి వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. వారిద్ద‌రూ ఆరోగ్యంగా ఉన్న‌ట్లు తేల్చారు.

రావ‌ల్పిండి జైల్లో వారికి బీ క్లాస్ వ‌స‌తుల్ని క‌ల్పించారు. ప్ర‌స్తుతం ఉన్న నిబంధ‌న‌ల ప్ర‌కారం బీ క్లాస్ వ‌స‌తుల్ని ఉన్న‌త స్థాయి విద్యావంతులు.. ధ‌నికులు త‌దిత‌రుల‌కు క‌ల్పిస్తారు. ఇందులో భాగంగా ఖైదీ గ‌దిలో ఒక మంచం.. కుర్చీ.. లాంత‌రు.. ఓ అల్మారా.. త‌దిత‌ర సౌక‌ర్యాలు ఉంటాయి. ఖైదీల ఆర్థిక స్తోమ‌త‌ను అనుస‌రించి జైలు గ‌దిలో ఫ్రిజ్‌.. ఏసీ.. టీవీ.. వార్తా ప‌త్రిక‌ల్ని స‌మ‌కూర్చుకునేందుకు అవ‌కాశం ఉంది. అయితే.. తుది నిర్ణ‌యం జైళ్ల శాఖ తీసుకోవాల్సి ఉంటుంది.

జైలుకు త‌ర‌లించిన అనంత‌రం న‌వాజ్ ష‌రీఫ్.. ఆయ‌న కుమార్తెకు టిఫిన్ కింద ఎగ్ ఫ్రై.. ప‌రోటాను అందించిన‌ట్లు చెబుతున్నారు. జైలుశిక్ష‌లో భాగంగా తండ్రి.. కుమార్తె ఇద్ద‌రూ సీ క్లాస్ లోని నిర‌క్ష‌రాస్యులైన ఖైదీల‌కు చ‌దువు చెప్పే బాధ్య‌త‌ను అప్ప‌గించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. వీరిద్ద‌రి అరెస్ట్ పై పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు చోటు చేసుకుంటున్నాయి.

ష‌రీఫ్ స్వ‌స్థ‌ల‌మైన పంజాబ్ ప్రావిన్సులో ప‌లుచోట్ల వారి మ‌ద్ద‌తుదారులు పోలీసుల‌తో గొడ‌వ‌ల‌కు దిగారు. ఈ సంద‌ర్భంగా చోటు చేసుకున్న ఘ‌ర్ష‌ణ‌ల్లో దాదాపు 50 మంది ష‌రీఫ్ మ‌ద్ద‌తుదారులు.. 20 మంది పోలీసులు గాయ‌ప‌డ్డారు. ఇదిలా ఉంటే.. ష‌రీఫ్.. మ‌రియంల అరెస్ట్ నేప‌థ్యంలో గొడ‌వ‌ల‌కు అవ‌కాశం ఉంద‌ని భావిస్తూ ష‌రీఫ్ పార్టీకి చెందిన 300 మంది నేత‌ల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని విడుద‌ల చేయాల్సిందిగా లాహోర్ హైకోర్టు ఆదేశించింది. త‌మ నాయ‌కుడికి.. ఆయ‌న కుమార్తెకు జైలు శిక్ష విధించ‌టాన్ని ష‌రీఫ్ మ‌ద్ద‌తుదారులు జీర్ణించుకోలేక‌పోతున్నారు. తీవ్ర ఆగ్ర‌హంతో ఉడికిపోతున్నారు.
Tags:    

Similar News