పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను చాలామంది జాలి పడుతున్నారట. ఆయన్ను భారత్ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తుండడమే కాకుండా పాకిస్థాన్ లోనూ అనుమానిస్తున్నారట. దాంతో శత్రుదేశానికే కాకుండా సొంత దేశానికీ షరీఫ్ శత్రువులా మారిపోయారని అంటున్నారు. భారత్ లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని షరీఫ్ చూసీచూడనట్లు వదిలేస్తున్నారని...అందుకే ఇక్కడ ఉగ్రదాడులు పెరిగాయని ఇండియా ఆరోపిస్తోంది.. షరీఫ్ ను మోసగాడిగా అభివర్ణిస్తోంది. అదేసమయంలో పాక్ లో మాత్రం షరీఫ్ ను మోడీ అనుకూల వ్యక్తిగా పేర్కొంటూ మండిపడుతున్నారు.
పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ మన ప్రధాని మోడీ మాటలకు పెద్దపీట వేస్తున్నారని పాక్ మాజీ క్రికెటర్ - పాకిస్థాన్ తెహరీక్ ఎ ఇన్సాఫ్ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. ఇస్లామాబాద్ లో ఇమ్రాన్ పార్టీ తలపెట్టిన భారీ ర్యాలీని ప్రభుత్వం ఉక్కుపాదాలతో అణిచేసి - వందమందికి పైగా అనుచరులను అరెస్టుచేయడంతో ఆయన మండిపడ్డారు. నవాజ్ షరీఫ్ లండన్ ఆస్పత్రిలో గుండె ఆపరేషన్ చేయించుకోడానికి వెళ్లినప్పుడు ఆయన ముందుగా తన తల్లి - పిల్లలకు కాకుండా మోడీకి ఫోన్ చేశారని ఆయన అన్నారు.
అవినీతిపరుడైన ప్రధాని షరీఫ్ ను కాపాడేందుకు ప్రభుత్వ యంత్రంఆగం మొత్తం పనిచేస్తోందని తెలిపారు. మొత్తానికి షరీఫ్ ఇంటా బయటా కూడా నిందలు ఎదుర్కొంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/