ఇప్పటివరకూ మాటలతో కత్తులు నూరుకొని.. కొన్ని సందర్భాల్లో అంతకు మించి అన్నట్లుగా వ్యవహరించిన దాయాది దేశాల మధ్య స్నేహ పరిమళాలు ఓ రేంజ్ లో వెదజల్లుతున్నాయి. రష్యా.. అఫ్ఘానిస్తాన్ దేశాల పర్యటనల్ని ముగించుకొని వస్తున్న సమయంలో ఎవరూ ఊహించని విధంగా ప్రధాని మోడీ పాక్ పర్యటన గురించి ట్వీట్ చేయటం.. ప్రపంచం మొత్తం విస్తుపోవటం తెలిసిందే.
కేవలం మూడు గంటల ముందు తన పాక్ పర్యటన గురించి లోకానికి చెప్పిన మోడీకి పాక్ లో ఘన స్వాగతం లభించింది. ఇద్దరు మిత్రుల మధ్య స్నేహ బంధం ఏస్థాయిలో ఉందన్న విషయం.. లాహోర్ ఎయిర్ పోర్ట్ లో మోడీ కోసం గంటపాటు నవాజ్ షరీఫ్ వెయిట్ చేసిన సన్నివేశమే చెప్పేసింది. తన మిత్రుడు తిరిగి వెళ్లే సమయంలోనూ ఎయిర్ పోర్ట్ కి వచ్చి సెంఢాప్ ఇచ్చిన తీరు అందరిని ఆకట్టుకుంది.
ఇదిలా ఉంటే.. షరీఫ్ ఇంటికి వెళ్లిన మోడీ.. అక్కడ షరీఫ్ మనమరాలి పెళ్లికి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా నవాజ్ షరీఫ్ కు ఒక తలపాగాను మోడీ బహుమతిగా ఇచ్చి వచ్చారు. స్నేహపూర్వకంగా మోడీ ఇచ్చిన తలపాగాను పక్కన పెట్టని షరీఫ్ దాన్ని ఆదివారం తన ఇంట జరిగిన వివాహ వేడుకల సందర్భంగా ధరించి తళుక్కుమన్నారు. మోడీ అందించిన స్నేహహస్తానికి షరీఫ్ ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నారన్నది తాజా తలపాగా ఉదంతమే చెప్పేస్తుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మొత్తానికి మోడీ స్నేహం.. షరీఫ్ తల మీదకెక్కి అందరి దృష్టిని ఆకర్షించిందని చెప్పక తప్పదు.