ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు... ఈ ప్రశ్నకు తెలంగాణ నేతలు సమాధానం చెబుతుండడంతో టీడీపీ అధినేత చంద్రబాబుకు మతిపోతోందట. తాజాగా తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి నాయిని నరసింహారెడ్డి ఏకంగా జగన్ ను ఏపీ సీఎం అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో జగన్ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పిన ఆయన ఆ తరువాత ఏం జరగబోతోందో కూడా చెప్పారు.
వచ్చే ఎన్నికల తరువాత జగన్ ఏపీలో అధికారంలోకి రాగానే చంద్రబాబు వెంటనే హైదరాబాద్ కు మకాం మారుస్తారని నాయిని వ్యాఖ్యానించారు. ఏపీలో అధికారం కోల్పోబోతున్న సంగతి చంద్రబాబుకు కూడా తెలుసని నాయని అన్నారు. అందుకే తెలంగాణలో టీడీపీ నుంచి నలుగురైదుగురు ఎమ్మెల్యేలు ఉంటే తాను హైదరాబాద్ లో కాపురం ఉన్నప్పుడు తెలంగాణ రాజకీయాల్లోనూ వేలు పెట్టేందుకు అవకాశం ఉంటుందని చంద్రబాబు ఆలోచన చేస్తున్నారని వివరించారు. అందుకే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారని అన్నారు.
రెండు రోజుల కిందట తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఇదే మాట చెప్పారు. ఏపీలో ఈసారి టీడీపీ రాదని ఆయన అన్నారు. తెలంగాణలో మహాకూటమిలో టీడీపీ ఉండడంతో ఏపీలో ఆ పార్టీకి గట్టి దెబ్బ పడుతుందని అన్నారు. ఏపీలో వైసీపీ విజయం ఖాయంగా కనిపిస్తోందని అన్నారు.