రెండో ప్రపంచయుద్ధంలో మాయమై పోలెండ్ లో కనుగొన్నట్టు చెపుతున్న నాజీ గోల్డ్ ట్రెయిన్ పై రష్యా, పోలెండ్ దేశాలు వార్ కు రెఢీ అవుతున్నాయి. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో హంగేరీ-బెర్లిన్ మధ్య నడిచే ఈ రైలును నాజీ దళాలు దారి మళ్లించాయి. ఈ ట్రెయిన్ చివరగా ఓ రష్యన్ సొరంగ మార్గంలో ప్రయాణించి తర్వాత మాయమైంది. ఇటీవల రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొని చనిపోయిన ఓ సైనికుడి మరణవాంగ్మూలం ఆధారంగా ఆరాతీస్తే దీని డొంకంతా కదిలినట్లయ్యింది.
1945లో జర్మన్ నాజీ దళాలు రష్యా దేశానికి చెందిన సంపదను ఈ ట్రెయిన్ లో పెట్టి జర్మనీకు తరలించేందుకు ప్లాన్ వేశారు. పూర్వపు సోవియట్ యూనియన్ లోని సెయింట్ పీటర్స్ బర్గ్ పట్టణం నుంచి ఈ గోల్డ్ ట్రెయిన్ జర్మనీకు బయలుదేరింది. రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ చనిపోయి..జర్మనీ ఓడిపోవడంతో హఠాత్తుగా ఈ ట్రెయిన్ ఏమైందో ఎవ్వరికి తెలియకుండా పోయింది.
అప్పటి నుంచి దాదాపు ఏడు దశాబ్దాలుగా వెలుగులోకి రాకుండా ఉన్న ఈ గోల్డ్ ట్రెయిన్ ను పోలెండ్ లోని మారుమూల పర్వత ప్రాంతాల్లో తాము గుర్తించినట్టు నిధి అన్వేషకులు చెప్పారు. ప్రస్తుత మార్కెట్ లో దీని విలువ ఒక ట్రిలియన్ డాలర్లు గా ఉంటుందని లెక్కలు వేస్తున్నారు. ఈ రైలుతో పాటు రైలులో బంగారం, వెండి, కళాకృతులు, ఇతర సంపద తమదే అయినందున అది తమకే చెందుతుందని రష్యా అంతర్జాతీయ న్యాయ నిపుణుల సలహా కోరనుంది. ఈ రైలు తమ దేశంలో దొరికితే ఆ రైలుతో పాటు ఆ సందప మొత్తం పోలెండ్ కే చెందుతుందని పోలెండ్ మంత్రి పియార్ట్ జుచూవ్ స్కీ చెపుతున్నారు. ఈ విషయంపై తాము చాలా కఠినంగా ఉన్నామని..న్యాయ నిపుణులు కూడా ఇది పోలెండ్ కు చెందుతుందని అంటున్నారని ఆయన తలిపారు.`
ఏదేమైనా రెండో ప్రపంచయుద్ధంలో మాయమై ఏడు సంవత్సరాలుగా ఎవ్వరికి కనపడకుండా పోయిన గోల్డ్ ట్రెయిన్ ఆచూకి లభ్యం కావడం..దానికోసం రష్యా, పోలెండ్ దేశాలు అది తమదే అంటూ వార్ కు దిగడంతో ఇప్పుడు ఈ గోల్డ్ ట్రెయిన్ ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ట్రెయిన్ లో అసలు ఎన్ని నిధులున్నాయి...రెండో ప్రపంచ యుద్ధానికి సంబంధించి ఏవైనా ఆధారాలు ఉన్నాయా అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి.