మూడు పార్టీల కూటమితో ఏర్పడిన మహారాష్ట్ర ప్రభుత్వానికి ఒక చిన్న ఝలక్ తగిలింది. మంత్రి వర్గ ఏర్పాటు జరిగిన కొన్ని గంటల్లోనే అసంతృప్త ఎమ్మెల్యే ఒకరు తన పదవికి రాజీనామా చేసినట్టుగా ప్రకటించారు! మంత్రి వర్గ ఏర్పాట్లు జరిగినప్పుడల్లా ఎవరో ఒకరు ఇలాంటి నిరాశలు వ్యక్తం చేయడం మామూలే. మంత్రి వర్గంలో చోటు దక్కని వారు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటారు. అయితే మహారాష్ట్రలో ఒక ఎమ్మెల్యే తను పదవికే రాజీనామా చేసినట్టుగా ప్రకటించారు. తను రాజకీయాలకు పనికారంటూ ఆయన ప్రకటించుకున్నారు! మంత్రి పదవి దక్కనందుకు గానూ ఆయన తను రాజకీయాలకే పనికిరానంటూ ప్రకటించి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్టుగా ప్రకటించుకున్నారు.
ఆయన పేరు ప్రకాష్ సోలంకి. బీద్ జిల్లాలోని ముజల్ గాన్ నుంచి ఎన్సీపీ తరఫున నెగ్గారు. మంత్రి పదవిని ఆశించిన ఆయన అది దక్కకపోవడంతో.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్టుగా ప్రకటించారు. అయితే ఆ రాజీనామా ఆమోదం పొందుతుందా, లేక ఆయనను కన్వీన్స్ చేస్తారా అనేది తర్వాతి సంగతి.
అయితే మహారాష్ట్రలో ఎలాంటి ప్రభుత్వం ఏర్పడిందో తెలిసిన సంగతే. మూడు పార్టీల కూటమిగా ప్రభుత్వం ఏర్పడింది. పదవులను మూడు పార్టీలు పంచుకున్నాయి. ఎలాగూ ప్రతి పార్టీలోనూ అసంతృప్తులు ఉండనే ఉంటారు.
తమ సీనియారిటీనో, తమ మెజారిటీనో పరిగణనలోకి తీసుకుని పదవి ఇవ్వలేదంటూ నిరసన తెలిపే వాళ్లు ఉంటారు. అప్పుడే ఇలా ఒక ఎమ్మెల్యే ఏకంగా రాజీనామా అంటున్నాడు. ఇది ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వానికి ఝలక్కే. ఇలాంటి వారిని భారతీయ జనతా పార్టీ మచ్చిక చేసుకుంటుందో.. వీరికి కూటమి పార్టీలే సర్ది చెప్పుకుంటాయో!