రాహుల్‌ కు మ‌హిళా క‌మిష‌న్ నోటీసులు..?

Update: 2019-01-10 06:51 GMT
ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఊహించ‌ని రీతిలో నోటీసులు వ‌చ్చాయి.  రాఫేల్ ఒప్పందంలో రాహుల్‌ దూకుడుగా ముందుకు సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ తన మిత్రుడు అనిల్ అంబానీకి రూ.30 వేల కోట్లు కట్టబెట్టేందుకు పబ్లిక్‌రంగ సంస్థ హెచ్‌ఏఎల్‌ను గాలికి వదిలేశారని రాహుల్ దుయ్యబట్టారు. ఓవైపు అధిక ధరకు రాఫెల్ యుద్ధ విమానాలను కొనడమే కాకుండా రాఫెల్ ఒప్పందంలో ఇండియా పార్టనర్‌గా హెచ్‌ ఏఎల్‌ను తొలగించి అనుభవం లేని అనిల్ అంబానీ స్థాపించిన రిలయన్స్ డిఫెన్స్ కంపెనీకి చోటు కల్పించారని ఆరోపించారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న నోరు జార‌గా...కాంగ్రెస్ ర‌థ‌సార‌థికి జాతీయ మహిళా కమిషన్ నోటీసులు జారీచేసింది.

లోక్‌ సభ ఎన్నికలకు రాజస్థాన్‌ లో ప్రచారాన్ని ప్రారంభించిన రాహుల్ జైపూర్‌ లో బుధవారం రైతుల సభలో ప్రసంగిస్తూ ప్రధాని మోదీ ఎప్పుడూ బ్యాక్‌ ఫుట్‌ లో ఆడుతున్నారు. ఫ్రంట్‌ ఫుట్‌ లో ఆడి సిక్సర్ కొట్టాలని దేశ యువతను కోరుతున్నా అని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశమంతటా పంట రుణాల మాఫీ చేస్తామని రాహుల్ ప్రకటించారు. రాఫేల్ ఒప్పందంపై లోక్‌ సభలో జరిగిన చర్చలో పాల్గొనకుండా మోదీ పారిపోయారని - తనను కాపాడాలని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ ను ముందుకు తెచ్చారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. అవినీతిని అనుమతించబోనని - చౌకీదార్‌ లా దేశానికి కాపలా కాస్తానని చెప్పిన మోదీ లోక్‌ సభలో రాఫెల్ ఒప్పందంపై చర్చ జరిగినప్పుడు కనీసం ఒక్క నిమిషం కూడా లేచి నిలబడలేకపోయారన్నారు. ఈ అంశంపై చర్చ సందర్భంగా నేను ప్రశ్నలు అడిగినప్పుడు 56 అంగుళాల ఛాతీ ఉన్న చౌకీదారు అక్కడినుంచి పారిపోయారు. తనను తాను సమర్థించు కోలేకపోతున్నానని - ఆ పని చేయాలని ఒక మహిళను (రక్షణమంత్రి సీతారామన్‌ ను) కోరుకున్నారు. 2.30 గంటలు జరిగిన చర్చలో ఆమె మోదీని సమర్థించలేకపోయారు. అవినీతి జరిగిన మాట వాస్తవమా? కాదా? అని అడిగిన ప్రశ్నకు స్పష్టమైన సమాధానం చెప్పలేక పోయారు అని రాహుల్ అన్నారు.

రాఫేల్ వివాదంపై చర్చలో ప్రధాని మోడీ చర్చ నుంచి పారిపోయి మహిళ(కేంద్ర రక్షణమంత్రి నిర్మలా సీతారామన్) వెనుక దాక్కున్నారన్న రాహుల్  ఆరోపించారు. వ్యాఖ్యలపై నోటీసులు జారీఅయ్యాయి. ప్రింట్ - ఎలక్ట్రానిక్ మాధ్యమాల్లో వచ్చిన వార్తా కథనాలను జాతీయ మహిళ కమిషన్ సుమోటోగా స్వీకరించి రాహుల్ గాంధీకి వివరణ నిమిత్తం నోటీసులు జారీచేసింది. మహిళ గౌరవ మర్యాదలను అగౌరపరిచే విధంగా రాహుల్ వ్యాఖ్యలు ఉన్నట్లు పేర్కొంది.


Full View

Tags:    

Similar News