ఎన్డీ తివారీ. ఈ సీనియర్ నేత గురించి తెలుగువారికి పరిచయం అవసరం లేదు. ఏపీ గవర్నర్ గా పనిచేసిన తివారీ ఆ సమయంలో సెక్స్ స్కాండల్ లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ సీనియర్ నాయకుడైన ఎన్డీ తివారి నేడు బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఆయన నేడు బీజేపీలో చేరనున్నారు. 91 ఏళ్ల తివారీ కేంద్ర మంత్రిగా, రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా, ఏపీ గవర్నర్ గా పని చేశారు. కాంగ్రెస్ పార్టీలో మంచి గుర్తింపు ఉన్న నాయకుడైన ఎన్డీ తివారీ సెక్స్ స్కాండల్ లో ఆరోపణలు ఎదుర్కొన్న అనంతరం కాంగ్రెస్ పార్టీ ఆయనను దూరంగా ఉంచింది.
మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీకి ఊహించని షాక్ తగిలే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ పార్టీ నాయకుడు, కేజ్రీవాల్ సన్నిహితుడు అయిన కుమార్ విశ్వాస్ త్వరలో బీజేపీ గూటికి చేరనున్నారు. ఈ మేరకు ఇప్పటికే బీజేపీ నాయకులతో చర్చలు జరిపినట్లు చెబుతున్నారు. ఒకటి రెండు రోజులలో తన నిర్ణయాన్ని వెలువరించే అవకాశం ఉందని అంటున్నారు. త్వరలో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికలలో కుమార్ విశ్వాస్ బీజేపీ అభ్యర్థిగా రంగంలోనికి దిగే అవకాశాలున్నాయని బీజేపీ వర్గాలు తెలిపాయి. కుమార్ బిస్వాస్ బీజేపీ అమిత్ షాతో నేడో రేపో అమిత్ షాతో భేటీ కానున్నారని ఆ వర్గాలు తెలిపాయి. ఇదిలాఉండగా... ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో సమాజ్ వాదీ పార్టీ –కాంగ్రెస్ ల పొత్త తమకు లాభమేనని బీజేపీ భావిస్తున్నది. ఆ రెండు పార్టీలూ పొత్త పెట్టుకున్నా ఎన్నికల ఫలితాలలో తమదే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నది. యూపీఎన్నికలలో ఇతర పార్టీలన్నీ పొత్తల కోసం వెంపర్లాడటమే తమ బలానికి చిహ్నమని బీజేపీ యూపీ సీనియర్ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/