క్రికెట్ మ్యాచ్ లో విజయం సాధించాలంటే ఓపెనర్లు అద్భుతంగా రాణిస్తే సరిపోతుందా? సమస్యే లేదు. ఓపెన్లు ఎంత అద్భుతంగా ఆడినా.. తర్వాత వచ్చే బ్యాట్స్ మెన్లు ఆడే ఆటతోనే మ్యాచ్ తుది ఫలితం ఆధారపడి ఉంటుంది. క్రికెట్ ఆటలోనే కాదు.. ఎన్నికల్లోనూ అదే పరిస్థితి. మొదటి రెండు రౌండ్ లలో అద్భుతమైన అధిక్యత లభించినా.. తర్వాత రౌండ్లలో అది కానీ కంటిన్యూ కాకుంటే పరిస్థితి ఇబ్బందే. బీహార్ ఎన్నికల ఫలితాలు చూస్తుంటే.. ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది.
ఆరంభం అదిరిపోయేలా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి దూసుకెళ్లింది. ఒక దశలో 110 స్థానాలకు సంబంధించిన ఓటింగ్ సరళి చూస్తే.. ఎన్డీయే కూటమి 70 స్థానాల్లో అధిక్యంలో ఉంటే.. లౌకికకూటమి 35 స్థానాల్లో అధిక్యంలో ఉంది. అనంతరం.. ఎన్డీయే హవా కొనసాగినప్పటికీ.. ఉదయం తొమ్మిదిన్నర నుంచి పరిస్థితుల్లో మార్పు రావటం మొదలైంది. ఆదిరిపోయేలా ఆరంభం ఉన్నప్పటికీ.. అత్యంత కీలకమైన మిడిల్ లో చతికిలపడినట్లుగా కనిపించటం ఎన్డీయే పక్షాలకు మింగుడు పడని విధంగా మారింది.
దీనిపై మరో వాదన కూడా ఉంది. తొలుత ఓట్ల లెక్కింపు మొదలైన స్థానాలు ఎన్డీయే అధిపత్యంలో ఉన్నవని.. లౌకిక కూటమికి అండగా నిలిచే స్థానాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు వివరాలు కాస్త ఆలస్యంగా రావటంతో ఇలాంటి పరిస్థితి ఎదురైందని చెబుతున్నారు. ఆరంభం అదిరి.. మిడిల్ లో వెనుకబడిన ఎన్డీయే కూటమి.. ఎన్నికల ఫలితాలు పూర్తిగా వచ్చేసరికి ఎలా ఉంటుందో చూడాలి. అదే విధంగా మొదట్లో చతికిలపడి.. మిడిల్ లో కోలుకొన్న లౌకిక కూటమి.. తన జోరును చివరివరకూ సాగిస్తుందా? అన్నది ప్రశ్న. మొత్తంగా బీహార్ ఎన్నికలకు సంబంధించి ప్రచారం.. పోలింగ్.. ఎగ్జిట్ పోల్స్ అన్ని ఆసక్తికరంగా సాగినట్లే.. ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ సైతం ఆసక్తికరంగా సాగుతుండటం విశేషం.