రాష్ట్రపతి పదవికి ఏన్డీయే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్లే సమయంలో ఆసక్తికరమైన దృశ్యం ఒకటి ఆవిష్కృతమైంది. నామినేషన్ దాఖలు చేసేందుకు ప్రధాని మోడీతో పాటు రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ వేసే రామ్ నాథ్ లతో పాటు.. బీజేపీ.. ఎన్డీయే మిత్రపక్షాల పరివారం మొత్తం ఒక్కచోటకు చేరింది.
నామినేషన్ వేసేందుకు లోపలికి వెళ్లే ముందు ఎన్డీయే పరివారం.. కొత్త మిత్రులంతా కలిసి చేతులెత్తి తమ బలాన్ని చాటేలా ఫోటోకు ఫోజు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.
మోడీ చేతిని అప్పటికే పట్టుకున్న రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్..అంతలోనే తన చేతిని విడిపించుకొని బీజేపీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ చేతిని పట్టుకున్నారు. అంతలోనే అద్వానీని చూసిన మోడీ తన చేతిని ఆయనతో జత చేశారు. ఫోటోకి ఫోజ్ ఇచ్చేందుకు అందరూ చేతులెత్తి సిద్ధమయ్యే లోపే.. మోడీ తన చేతిని దించేసి ముందుకు వెళ్లటం కనిపించింది.
సాధారణంగా ముఖ్యమైన వేళల్లో ఫోటోలకు ఫోజ్ ఇచ్చేందుకు కనీసం నిమిషం పాటైనా నిలబడతారు.మరి ఏమైందో ఏమో కానీ.. మోడీ మాత్రం ముక్తసరిగా చేతులు ఎత్తామంటే ఎత్తామన్నట్లుగా ఎత్తేసి.. సరిగ్గా ఫోటోకి ఫోజ్ ఇవ్వకుండానే ముందుకు వెళ్లిపోవటంతో.. మిగిలిన వారంతా ఆయన బాట పట్టారు. ఫోటో ఫోజ్‌కి మోడీ ఎందుకంత ముక్తసరిగా వ్యవహరించినట్లు?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/