దేశంలో లోక్ సభ సార్వత్రిక ఎన్నికల వేళ.. తొలిదశ పోలింగ్ కు రంగం సిద్ధం అవుతున్న సమయంలో వార్తా చానళ్లు తమ తమ సర్వేలను ప్రచారంలోకి తీసుకొస్తూ ఉన్నాయి. అందులో భాగంగా ప్రముఖ ఆంగ్ల వార్తా చానల్ ఎన్డీటీవీ వివిధ పార్టీలకు వచ్చే ఎంపీ సీట్ల విషయంలో తన అంచనాలను వెలువరించింది. తన సర్వే ఫలితాలుగా వివిధ పార్టీలకు సంబంధించిన అంచనాలను వెలువరించింది.
ఏపీ - తెలంగాణ - తమిళనాడు - పశ్చిమబెంగాల్ - ఒడిశాల్లో ఏ పార్టీకి ఎన్ని ఎంపీ సీట్లు దక్కుతాయనే అంశం గురించి ఎన్డీటీవీ తన అంచనాలను వెలువరించింది. ఈ రాష్ట్రాలన్నింటిలోనూ ప్రాంతీయ పార్టీల హవా ఉండటం ఖరారు అయిన అంశమే.ఈ నేపథ్యంలో ఎన్డీటీవీ అంచనాలు ఆసక్తిదాయకంగా ఉన్నాయి.
-బెంగాల్ లో మమతా బెనర్జీ పార్టీ ఊపు ఉందని ఎన్డీటీవీ పేర్కొంది. తమ అంచనాల ప్రకారం టీఎంసీ కి కనీసం ముప్పై ఎంపీ సీట్లు దక్కుతాయని వివరించింది.
-తమిళనాట డీఎంకే హవా సుస్పష్టం అంటోంది ఈ సర్వే. స్టాలిన్ ఆధ్వర్యంలోని ఆ పార్టీ పాతిక ఎంపీ సీట్లను నెగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది.
-ఒడిశాలో బీజేపీకి ఇరవై ఒక్క ఎంపీ సీట్లకు గానూ పదహారు సీట్లు దక్కే అవకాశం ఉందని ఈ సర్వే అంచనా వేసింది.
-తెలంగాణలో పదిహేడు ఎంపీ సీట్లకు గానూ తెలంగాణ రాష్ట్ర సమితికి పదిహేను ఎంపీ సీట్లు దక్కే అవకాశం ఉందని పేర్కొంది.
-ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. ఏపీ విషయానికి వస్తే ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనమే అని ఈ సర్వే చెబుతోంది. పాతిక ఎంపీ సీట్లున్న ఏపీలో ఇరవై ఎంపీ సీట్లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెగ్గుతుందని ఎన్డీటీవీ తన సర్వేలో పేర్కొంది.