టీఆర్ఎస్ అధ్యక్షుడు - అపద్ధర్మ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు తిరిగి అధికారం కట్టబెట్టడం ఖాయమని ఇప్పటికే వివిధ సంస్థలు, ఛానల్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి తోడుగా మరో జాతీయ టీవీ ఛానల్ సైతం గులాబీ దళపతికి తీపికబురు అందించింది.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్ మరోసారి విజయ ఢంకా మోగించే అవకాశాలు అధికంగా ఉన్నాయని ఎన్డీటీవీ అభిప్రాయపడింది. గత నాలుగున్నరేళ్లలో ఆ పార్టీ అమలు చేసిన సంక్షేమ పథకాలు, వివిధ వర్గాల ప్రజల్లో ఉన్న సానుకూలత మరోసారి విజయాన్ని చేకూర్చవచ్చని విశ్లేషించింది. తెలంగాణలో స్థానికత్వం, సంక్షేమ పథకాలే ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించనున్నట్టు ఎన్డీటీవీ అధిపతి ప్రణయ్‌రాయ్ పేర్కొన్నారు. ఆ దిశగా సంక్షేమ పథకాల అమలులో టీఆర్‌ఎస్ విజయవంతమైనట్టు ఆ చానల్ అభిప్రాయపడింది.
తెలంగాణలోని పలు పథకాలు టీఆర్ఎస్ గెలుపునకు బాటలు వేస్తాయని ఎన్డీటీవీ విశ్లేషించింది. రైతు బంధు - వృద్ధాప్య పింఛన్లు - వ్యవసాయానికి ఉచిత విద్యుత్ - గొర్రెల పంపిణీ పథకం - కల్యాణలక్ష్మి - షాదీ ముబారక్ పథకాలు తెలంగాణలో పూర్తిగా విజయవంతమయ్యాయని తెలిపింది. రైతు బీమా పథకం ప్రాథమిక దశలో ఉందని, రుణ మాఫీ పాక్షికంగా విజయవంతమైందని పేర్కొంది. ఇంటింటికీ తాగునీరు పథకం కింద పనులు పూర్తయినప్పటికీ కొన్ని ప్రాంతాలకు ఇంకా నీరు సరఫరా కావడం లేదని తెలిపింది. తెలంగాణలో 9 నుంచి 10 శాతం మధ్య ఉన్న షెడ్యూల్డు తెగలు, ఏడు శాతం ఉన్న లంబాడాలు టీఆర్‌ఎస్ పట్ల మొగ్గు చూపుతున్నారు. మూడు శాతం ఉన్న గోండులు - కోయలు టీఆర్‌ఎస్ తమకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతున్నారు. ఇక 18 నుంచి 20 శాతం మధ్య ఉన్న మాల, మాదిగ కులాలకు చెందిన వారు (ఎస్సీలు) ప్రభుత్వ ఓబీసీ అనుకూల విధానాల పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పటికీ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందామని అంటున్నారు. 12 శాతం ఉన్న ముస్లింలు హైదరాబాద్‌లో ఎంఐఎంకు పూర్తి మద్దతును తెలుపుతుండగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లింలు మాత్రం షాదీముబారక్ పథకంతో లబ్ధి పొందామంటూ ప్రభుత్వ అనుకూలతను చాటుతున్నారు. దక్షిణ తెలంగాణ కన్నా ఉత్తర తెలంగాణలో టీఆర్‌ఎస్ అత్యంత పటిష్ఠంగా ఉన్నదని ఎన్డీటీవీ అభిప్రాయపడింది. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 20 శాతం ఓట్ల తేడాతో ఉత్తర తెలంగాణలో విజయం సాధించిందని తెలిపింది. అదే దక్షిణ తెలంగాణలో గెలుపు ఓటముల మధ్య తేడా 11 శాతంగా ఉన్నదని పేర్కొంది.