ఘోర రోడ్డు ప్రమాదం.. 20 వాహనాలు ఢీ

Update: 2021-01-01 14:06 GMT
ఉత్తర భారతాన్ని పొగమంచు కమ్మేసింది. తీవ్రమైన చలి ధాటికి మనుషులు కూడా కనపడనంత దట్టంగా మంచు కమ్ముకుంది. ఇదిప్పుడు డేంజర్ గా మారి ప్రమాదాలకు కారణమవుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతున్నాయి.

తాజాగా యూపీ-హర్యానా సరిహద్దుల్లో దట్టమైన పొగమంచు కారణంగా ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఏకంగా 20 వాహనాలు ఒకదానికొకటి ఢీకొని కుప్పలు కుప్పలుగా ఇరుక్కుపోయాయి. అనేకమంది వాహనాల్లో నలిగిపోయి తీవ్రంగా గాయపడ్డారు. కార్లన్నీ తుక్కుతుక్కు అయ్యాయి.

బాగ్ పాట్ సమీపంలోని యూపీ-హర్యానా సరిహద్దు ప్రాంతమైన తూర్పు ఫెరిఫెరల్ ఎక్స్ ప్రెస్ వేపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

క్షతగాత్రులను బాగ్ పట్ లోని జిల్లా ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. చాలా మంది గాయపడ్డట్టు తెలిసింది. డిసెంబర్ 22న కూడా ఇలానే కార్లు, బస్సులు, ట్రక్కులు ఢీకొని 10 మంది గాయపడ్డారు.


Tags:    

Similar News