కొత్త ఎంపీల్లో 50 శాతం అలాంటోళ్లేన‌ట‌!

Update: 2019-05-26 07:09 GMT
సార్వ‌త్రిక ఎన్నిక‌లు ముగిశాయి. కొత్త ఎంపీల్ని ప్ర‌జ‌లు ఎంచుకున్నారు. త్వ‌ర‌లో కొలువు తీర‌నున్న లోక్ స‌భ‌కు సంబంధించిన షాకింగ్ నిజం ఒక‌టి తెర మీద‌కు వ‌చ్చింది. 2014తో పోలిస్తే తాజా ఎన్నిక‌ల్లో  గెలిచిన ఎంపీల్లోనే అత్య‌ధికులు నేర‌చ‌రిత్ర ఉన్న వారు ఉండ‌టం గ‌మ‌నార్హం. మోడీ 2.0గా అభివ‌ర్ణిస్తున్న 17వ లోక్ స‌భ‌కు ఎన్నికైన స‌భ్యుల్లో స‌గం మంది నేర‌చరిత్ర ఉన్నోళ్లే.

తాజాగా ఎన్నికైన 539 మంది కొత్త ఎంపీల్లో 233 మంది మీద వివిధ సెక్ష‌న్ల మీద కేసులు న‌మోదై ఉన్నాయి. 2009లో 44 శాతం మంది ఎంపీల మీద కేసులు ఉంటే.. 2014లో 185 మంది ఎంపీల మీద కేసులు ఉన్నాయి. ఎడుక్కి ఎంపీ కాంగ్రెస్ నేత మీద ఏకంగా 204 పెండింగ్ కేసులు ఉండ‌టం విశేషం.

తాజాగా ఎన్నికైన ఎంపీల్లో 29 శాతం మంది (159 మంది ఎంపీలు) మీద తీవ్ర‌మైన నేరారోప‌ణ‌లు ఉన్నాయి. వారిలో ప‌లువురి మీద అత్యాచారం.. హ‌త్య‌.. హ‌త్యాయ‌త్నం.. కిడ్నాపింగ్.. మ‌హిళ‌ల్ని వేధించ‌టం లాంటి కేసులు ఉన్నాయి. ఈసారి ఎన్నికైన వారితో పోలిస్తే.. 2014లో ఎన్నికైన ఎంపీల మీద త‌క్కువ‌గా నేరారోప‌ణ‌లు ఉన్నాయి. ఏది ఏ సంవ‌త్స‌రానికి ఆ సంవ‌త్స‌రం పెరుగుతుందే త‌ప్పించి త‌గ్గ‌ని పరిస్థితి.

2009లో 76 మంది ఎంపీల మీద క్రిమిన‌ల్ కేసులు ఉంటే.. 2014లో 112 మంది ఎంపీల మీద తీవ్ర‌మైన నేరారోప‌ణ‌లు ఉన్నాయి. ఈసారి ఆ సంఖ్య మ‌రింత పెరిగిన ప‌రిస్థితి. ఇదిలా ఉంటే తాజాగా ఎన్నికైన 303 మంది బీజేపీ ఎంపీల్లో 116 మంది ఎంపీలు క్రిమిన‌ల్ కేసుల్ని ఎదుర్కొంటున్నారు. ఇక‌.. విప‌క్షాల విష‌యానికి వ‌స్తే నేరారోప‌ణ‌లుఎదుర్కొంటున్న ఎంపీల్లో 29 మంఇ కాంగ్రెస్‌.. ప‌ది మంది డీఎంకే ఎంపీలు ఉన్నారు. నామినేష‌న్ల సంద‌ర్భంగా దాఖ‌లు చేసిన అఫిడ‌విట్ల ఆధారంగా ఈ వివ‌రాల్ని విశ్లేషించారు.


Tags:    

Similar News