వెజిటేరియన్ పోలీస్ కావాలి..యోగి ఆదేశాలు..

Update: 2018-09-29 03:55 GMT
హిందుత్వ వాది ఉత్తర ప్రదేశ్ సీఎం అయ్యారు. గద్దెనెక్కినప్పటి నుంచి హిందూ అనుకూలుడిగానే యోగి ఆదిత్యనాథ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఉత్తర ప్రదేశ్ లో పశువధ శాలలను నిషేధించారు. హిందుత్వ వాదులకు కొండంత అండగా నిలుస్తాడనే విమర్శలను కొని తెచ్చుకున్నాడు. దళితులు - ముస్లింలపై దాడులు జరుగుతున్నా మిన్నకుండిపోతున్నాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అయినా తన హిందూ స్టాండ్ ను మాత్రం విడవకుండా యోగి ముందుకు పోతున్నాడు.

తాజాగా అలహాబాద్ లో ప్రతిష్టాత్మకంగా చేసే కుంభమేళాను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సీరియస్ గా తీసుకున్నాడు. దానికి ఎలాంటి కళంకం ఎదురుకాకూడదని ఏకంగా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కుంభమేళాకు బందోబస్తు నిర్వహించే పోలీసులు కూడా నాన్ వేజ్ తినకూడదని.. రాష్ట్రంలోని వెజిటేరియన్ పోలీసులనే వినియోగించాలని పోలీస్ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.. ఎస్పీ నుంచి సాధారణ కానిస్టేబుల్ వరకూ శాఖాహారమే తినాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

సీఎం యోగి ఆదేశించడంతో ఇప్పుడు పోలీసులు తల పట్టుకున్నారు. రాష్ట్రంలోని శాఖహారులైన.. బ్రహ్మణ ,వైశ్య సామాజికవర్గంలోని వెజిరేటియన్ పోలీసుల కోసం వెతుకులాట పనిలో పడ్డారట.. కుంభమేళ వేడుకలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఘనంగా నిర్వహించాలని యోగి ప్రయత్నించడం బాగానే ఉన్నా.. ఈ వెజిటేరియన్ పోలీసులను ఎక్కడి నుంచి తేవాలని  పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇలా అయితే దొరకడం కష్టమని.. శాంతి భద్రతల సమస్యలు ఎదురవుతాయని వాపోతున్నారు.
Tags:    

Similar News