హైస్పీడ్‌ రైలుకు ఎన్ని డబ్బులు కావాలంటే..?

Update: 2015-03-16 18:55 GMT
సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రధాని మోడీ పలుమార్లు ప్రస్తావించిన అంశాల్లో హైస్పీడ్‌ రైలు ఒకటి. ఈ హైస్పీడు రైళ్లను ప్రయోగాత్మకంగా ప్రవేశ పెట్టి.. దేశవ్యాప్తంగా నిర్మించాలన్న లక్ష్యంతో మోడీ ఉన్నట్లు పలుమార్లు వెల్లడించారు.

తాజాగా.. ఈ హైస్పీడ్‌ రైలుకు సంబంధించిన సమాచారం బయటకు వచ్చింది. హైస్పీడ్‌ రైల్వే ట్రాక్‌కు సంబంధించి కిలోమీటరు నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందని పార్లమెంటులో ప్రశ్నించారు.

దీనికి బదులిచ్చిన రైల్వే మంత్రి సురేశ్‌ ప్రభు స్పందిస్తూ.. ఒక కిలోమీటరు హైస్పీడు రైల్వే మార్గానికి రూ. వందకోట్లు ఖర్చు అవుతాయని వెల్లడించారు. అన్ని మార్గాలను హైస్పీడు రైల్వే మార్గాలుగా మార్చాలంటే దాదాపు రూ.80వేల కోట్లు అవసరమవుతాయని ప్రకటించారు. సాధారణ రైల్వే మార్గాని కంటే 10 నుంచి 14 రెట్లు సమర్థవంతంగా హైస్పీడ్‌ రైల్వే లైన్లు వేయాల్సి ఉంటుందని వెల్లడించారు.

తాజాగా రైల్వే మంత్రి చెప్పిన ఖర్చు లెక్కలను చూస్తే.. హైస్పీడు రైలు వ్యవహారం భారీ ఖర్చుతో కూడుకుందన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. హైస్పీడ్‌ రైళ్ల కంటే.. వీలనైనన్ని ఎక్కువ రైళ్లను ఏర్పాటు చేస్తే దేశ ప్రజలకు అనువుగా ఉంటుందేమో..?

Tags:    

Similar News