టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కి స్వర్ణ పతకం అందించిన నీరజ్ చోప్రా రాత్రికి రాత్రే హీరోగా మారిపోయాడు. జావెలిన్ త్రో ఫైనల్లో ఈటెని 87.58 మీటర్లు విసిరిన నీరజ్ చోప్రా.. అథ్లెటిక్స్‌లో భారత్ 100 ఏళ్ల పతక నిరీక్షణకి తెరదించిన విషయం తెలిసిందే. దాంతో.. ప్రపంచవ్యాప్తంగా నీరజ్ చోప్రా పేరు మార్మోగిపోయింది. ఒక్క రోజు వ్యవధిలోనే సోషల్ మీడియాలో అతని ఫాలోయర్ల సంఖ్య లక్షల్లో పెరిగిపోగా, అతని బయోపిక్ తీసేందుకు బాలీవుడ్ నిర్మాతలు ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో షూటర్ అభినవ్ బింద్రా గోల్డ్ మెడల్ సాధించగా.. ఆ తర్వాత వ్యక్తిగత విభాగంలో పసిడి గెలిచిన రెండో భారత క్రీడాకారుడిగా నీరజ్ చోప్రా అరుదైన ఘనత సాధించాడు. ఒలింపిక్స్ చరిత్రలో అథ్లెటిక్స్ లో భారత్‌కి పసిడి పతకం దక్కడం ఇదే తొలిసారి.
తొలిసారి ఒలింపిక్స్‌లో ఆడుతున్న 23ఏళ్ల నీరజ్ చోప్రా.. క్వాలిఫికేషన్ రౌండ్‌లో 86.59 మీటర్లు జావెలిన్ త్రోని విసిరి ఫైనల్‌కి అర్హత సాధించాడు. ఫైనల్లోనూ నీరజ్ చోప్రాకి ఎవరూ సమీపంలో కూడా లేకపోయారు. ఇదిలా ఉంటే .. గోల్డ్ మెడల్ సాధించిన తరువాత నీరజ్ చోప్రా ఫాలోవర్స్ సంఖ్య 20 లక్షలకు పైగా పెరిగింది. ఇక ఇన్ స్టాగ్రమ్ లో ఏ పోస్ట్ చూసినా నీరజ్ గురించే అంటే అతిశయోక్తి కాదు. కాగా, బంగారు పతక విజేత నీరజ్ చోప్రాకు విపరీతమైన క్రేజ్ పెరిగింది. ముఖ్యంగా అమ్మాయిల్లో ఫాలోయింగ్ పెరిగిపోయింది. గోల్డ్ మెడల్ సాధించిన తరువాత నీరజ్ హాట్ ట్రెండ్ అయ్యాడు.
అతను నేషనల్ క్రష్ గా పిలవబడ్డాడు. నీరజ్ గురించి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు అమ్మాయిలు గూగుల్ ను సెర్చ్ చేసేస్తున్నారు. అతని కెరీర్, ఆహారం, కుటుంబం, ప్రేమ జీవితం, గర్ల్ ఫ్రెండ్స్ వంటి వివరాల కోసం తెగ వెతికేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నీరజ్ పలు టీవీ చానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అయితే, ఇంటర్వ్యూ తీసుకునే యాంకర్స్ సైతం నీరజ్ పర్సనల్ లైఫ్ గురించి గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తున్నారు. అతని వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో యాంకర్, నీరజ్ చోప్రా ప్రేయసి గురించి ప్రశ్నించారు.
ఆ ప్రశ్నకు నీరజ్ కాస్త అసౌకర్యంగా ఫీల్ అయ్యాడు. ఒలింపిక్స్ విజయం తరువాత.. దేశంలోనే యువతులు అంతా అతనిపట్ల క్రష్ కలిగి ఉననారని, మీ స్పందనేంటి అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నలన్నింటికీ నీరజ్ ఒక్కటే సమాధానం చెప్పాడు. ప్రజలు తనను ఇష్టపడటం సంతోషమే అని, అయితే, ప్రస్తుతానికి తన దృష్టి అంతా గేమ్స్‌పైనే అని స్పష్టం చేశాడు. అయితే, సదరు జర్నలిస్ట్.. నీరజ్‌ను మాత్రం వదిలిపెట్టడం లేదు. నీకు ప్రేయసి ఉందా? అంటూ సూటిగా ప్రశ్నించారు. నీరజ్ అదే సమాధానం చెప్పినా వినిపించుకోకుండా.. మళ్లీ మళ్లీ అవే ప్రశ్నలు వేశారు. దాంతో నీరజ్ కాస్త ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. ఈ ఇంటర్వ్యూ చూసిన నెటిజన్లు.. సదరు యాంకర్ తీరు పై ఫైర్ అవుతున్నారు.
ఒలింపిక్ టైటిల్‌తో మహిళా అభిమానులు కూడా జతయ్యారు. కానీ నాకైతే గర్ల్‌ఫ్రెండే ఇప్పటివరకు లేదు. భవిష్యత్తులో నన్ను ప్రేమించే నెచ్చెలి ఎవరైనా ఉంటారేమో చూద్దాం. ఇప్పుడు నేను పూర్తిగా కెరీర్‌పైనే దృష్టి పెట్టాను. ఈవెంట్లు, ప్రదర్శన, పతకాలు ఇవే నా ముందున్నవి. మిగతావన్నీ ఆ తర్వాతే, తదుపరి జరి గే పోటీలు, సన్నాహక శిబిరాలపైనే ఎక్కువగా ఆలోచిస్తాను. నాకు పానీ పూరిలంటే ఇష్టం. కానీ టోక్యోలో ఈవెంట్ కోసం వాటి ని తినలేదు. కడుపు నొప్పి, ఇతరత్రా ఆరోగ్య సమస్యల రిస్క్ ఎందు కని వాటికి దూరంగా ఉన్నాను అని నీరజ్‌చెప్పాడు.