నీరజ్ చోప్రా రూమ్మేట్ గా ఉండాలంటే అదో సాహసమట

Update: 2021-08-10 08:31 GMT
రాత్రికి రాత్రి భారత్ లాంటి దేశంలో అందరికి సుపరిచితుడిగానే కాదు హీరోగా మారిన క్రీడాకారుడు నీరజ్ చోప్రా. ఒకే ఒక్క మ్యాచ్.. ఒకే ఒక్క భారీ విజయంతో అందరి తలలో నాలుకలా మారిన నీరజ్ గురించి తెలుసుకోవాలన్న కుతూహలం అందరిలో ఎక్కువ అవుతోంది. వందేళ్లకు పైగా సాగిన నిరీక్షణకు పుల్ స్టాప్ పెడుతూ బంగారు పతకాన్ని సాధించిన అతగాడి పుణ్యమా అని ఇప్పుడు జావెలిన్ త్రో మీదా అందరిలో ఆసక్తి వ్యక్తమవుతోంది.

ఓవర్ నైట్ స్టార్ సెలబ్రిటీగా మారిన నీరజ్ చోప్రాకు సంబంధించిన షాకింగ్ నిజాన్ని బయటపెట్టాడు అతడి రూమ్మేట్ గా అతని రూంను షేర్ చేసుకున్న అథ్లెట్ తేజస్విని శంకర్. ఎవరికి తెలీని నిజాల్ని అతడు రివీల్ చేశాడు. బెంగళూరులో రెండు వారాల పాటు తాను నీరజ్ తో కలిసి రూం షేర్ చేసుకున్నానని.. అతడితో రూం షేర్ చేసుకోవటం అంటే మాత్రం తాను భయపడతానని చెప్పాడు.

‘అతడు ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించి ఉండొచ్చు. కానీ.. అతడితో రూం షేరింగ్ కు మాత్రం భయపడతాను. ఎందుకంటే.. గదిలో తన బట్టలన్నీ చిందరవందరగా పడేస్తాడు. హాల్ మధ్యలో సాక్స్ ను ఆరబెడతాడు. తను చేసే పనులు ఇబ్బంది పెట్టినా.. అతన్ని మాత్రం నేనేమీ అనేవాడిని కాను. గదిని షేర్ చేసుకున్న పదిహేను రోజుల పాటు తామిద్దరం ఇష్టంగా తిన్న డిషెస్ గురించి వెల్లడించాడు.

‘మా ఇద్దరికి ఫ్రైడ్ రైస్.. మట్కా కుల్ఫీ ఇష్టంగా తినేవాళ్లం. నీరజ్ కు మినీ మిలీషియా గేమ్ అంటే ఇష్టం. అంతకంటే పిచ్చి అని చెప్పొచ్చు. ఇప్పుడు మాత్రం..  పబ్జీ ఎక్కువగా ఆడటానికి ఇష్టపడుతున్నాడు. ఈసారి అతడ్ని కలిసినప్పుడు మాత్రం అతడికి గర్ల్ ఫ్రెండ్ ఉందో లేదో అడుగుతా’ అంటూ అతడి గురించిన ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. గోల్డెన్ బాయ్ గా పేరు తెచ్చుకున్న నీరజ్ సీక్రెట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ దెబ్బకు తన అలవాట్లను మార్చేసుకుంటాడేమో?
Tags:    

Similar News