టోక్యో ఒలింపిక్స్: . జావెలిన్ త్రో లో నీరజ్ చోప్రా అద్భుతం !

Update: 2021-08-04 09:19 GMT
టోక్యో ఒలంపిక్స్ లో పురుషుల జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ గ్రూప్-ఏలో నీరజ్‌ చోప్రా ఫైనల్స్‌ కు అర్హత సాధించాడు. 86.65 మీటర్లు విసిరి నేరుగా ఫైనల్‌ కు చేరుకున్నాడు. తొలి ప్రయత్నంలోనే అతను రికార్డు స్థాయిలో 86.65 మీటర్ల దూరం పాటు జావెలిన్‌ ను విసిరాడు. గ్రూప్-ఏ విభాగంలో అగ్రస్థానంలో నిలిచి.. నేరుగా ఫైనల్‌కు అర్హత సాధించాడు. జావెలిన్ త్రో విభాగంలో ఫైనల్స్‌కు చేరాలంటే 83.50 మీటర్ల దూరం పాటు జావెలిన్‌ ను విసరాల్సి ఉంటుంది.. లేదంటే తొలి 12 మందిలో నిలవాల్సి ఉంటుంది.

నీరజ్ చోప్రా ఏకంగా 86 మీటర్లకు జావెలిన్‌ను సంధించడంతో ఆటోమేటిక్‌ గా ఫైనల్స్‌ కు అర్హత సాధించినట్లయింది. 44అలాగే ఈ సీజన్‌ లో అతనికి అత్యుత్తమ త్రో కావడం విశేషం. ఇదిలా ఉండగా.. ఇదే గ్రూప్‌ లో ఫిన్లాండ్‌కు చెందిన లస్సీ ఎటలాట 84.50 మీటర్ల త్రోతో నేరుగా ఫైనల్స్‌ కు అర్హత సాధించాడు. ఆ తర్వాత రొమేనియాకు చెందిన అలెగ్రాండ్రూ మిహైతో నోవాక్‌ 83.27 మీటర్లు విరిసి మూడుస్థానంలో నిలిచాడు. స్వీడన్‌ కు చెందిన కిమ్‌ అంబ్‌ 82.40 మీటర్లతో నాలుగో స్థానంలో, జర్మన్‌ లెజెండ్‌ జోహన్నెస్‌ వెట్టర్‌ 82.04తో ఐదో స్థానాన్ని నిలుపుకున్నాడు. కాగా, జావెలిన్‌ త్రో ఫైనల్‌ మ్యాచ్‌ ఈ నెల 7న జరుగనుంది.

ఇది నాకు ఫస్ట్ ఒలింపిక్స్, వార్మప్‌లో నా ప్రదర్శన మెరుగ్గా లేదు. కానీ.. క్వాలిఫికేషన్ రౌండ్‌లో ఫస్ట్ అటెంప్ట్‌లోనే త్రో బాగా కుదిరింది. సెకండ్ త్రో ఫర్‌ఫెక్ట్. అయితే.. ఫైనల్లో ఫీలింగ్ భిన్నంగా ఉండనుంది. ఎందుకంటే.. వరల్డ్ అత్యుత్తమ జావెలిన్ త్రోయర్‌లు అక్కడ ఉంటారు. కాబట్టి.. ఫిజికల్‌గానే కాదు మెంటల్‌గా కూడా ప్రిపేర్ అవ్వాలి. ఫైనల్లో హై స్కోరు చేసేందుకు ప్రయత్నిస్తా’’ అని నీరజ్ చోప్రా చెప్పుకొచ్చాడు. క్వాలిఫికేషన్ రౌండ్‌లో 83.50మీ మార్క్‌ని అందుకున్న జావెలిన్ త్రోయర్లు, టాప్-12లో నిలిచిన త్రోయర్లు ఫైనల్‌కి అర్హత సాధించనున్నారు. పతకాల కోసం ఫైనల్ పోరు శనివారం జరగనుంది. హర్యానాకి చెందిన నీరజ్ చోప్రా ఫైనల్లో ఎలాంటి ప్రదర్శన కనబరుస్తాడో, చూడాలి. నీరజ్ చోప్రా అత్యుత్తమ త్రో 88.07మీ.. 2021, మార్చిలో జరిగిన ఇండియన్ గ్రాండ్ ఫ్రిక్స్ 3 లో ఈ త్రో విసిరాడు.




Tags:    

Similar News