వేల కోట్ల కుంభకోణానికి పాల్పడి, దేశం విడిచి బ్రిటన్ కు పారిపోయిన ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ మళ్లీ ట్విస్ట్ ఇచ్చాడు. తనను భారత్ కు పంపించడానికి అనుకూలంగా బ్రిటన్ ప్రభుత్వం తీసుకున్ననిర్ణయాన్ని బ్రిటన్ హైకోర్టులో సవాల్ చేశారు. పౌరసత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ,తనను భారత్ కు పంపించడానికి వీలుగా ఆ దేశ హోం మంత్రిత్వ శాఖ ఇటీవలే అనుమతి ఇచ్చిన ప్రతిపాదనలన్నీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని చెప్పారు. తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకునేలా ఆదేశాలను జారీ చేయాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు.
10 వేల కోట్లకి పైగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ను మోసగించిన కేసులో నీరవ్ మోడీ ప్రధాన నిందితుడు. కేసులు నమోదైన వెంటనే ఆయన దేశం విడిచి పారిపోయారు. కేంద్ర దర్యాప్తు సంస్థ.. సీబీఐ, ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆయనపై కేసు నమోదు చేశాయి. కేంద్ర ప్రభుత్వం విజ్ఙప్తి మేరకు బ్రిటన్ పోలీసులు నీరవ్ మోడీని అదుపులోకి తీసుకున్నారు. బెయిల్ కోసం ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. విచారణలో భాగంగా నీరవ్ మోడీని స్వదేశానికి రప్పించడానికి సీబీఐ అధికారులు తరచూ సంప్రదింపులను చేస్తోన్నారు. ఈ క్రమంలో నీరవ్ మోడీని భారత్ కు అప్పగించాలంటూ బ్రిటన్ న్యాయస్థానం ఈ ఏడాది ఫిబ్రవరిలో తీర్పు ఇచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు నీరవ్ మోడీని భారత్‌కు అప్పగించడానికి ఉద్దేశించిన ప్రతిపాదనలపై బ్రిటన్ హోం మంత్రిత్వ శాఖ కిందటి నెల ఆమోద ముద్ర వేసింది. తాజాగా నీరవ్ మోడీ దీనిపై అప్పీల్ కు వెళ్లారు. బ్రిటన్ హోం మంత్రిత్వ శాఖ తనను భారత్ కు అప్పగించడం చట్టవిరుద్ధమంటూ అప్పీల్ చేశారు. తన మానసిక స్థితి, ఆరోగ్య పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.