ఏపీ, తెలంగాణ మధ్య లాక్ డౌన్ తో బంద్ అయిన ఆర్టీసీ బస్సు సర్వీసులు మళ్లీ నడిపేందుకు ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారుల మధ్య జరిగిన చర్చలు ఫలించలేదు. మంగళవారం హైదరాబాద్ లోని బస్ భవన్ లో తెలంగాణ, ఆర్టీసీ ఎండీల మధ్య సమావేశం జరిగింది. అనంతరం ఎండీలు వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు.
రూట్ల వారీగా రెండు రాష్ట్రాలు బస్సులు నడపాలని ప్రతిపాదించామని.. మాకు క్లారిటీ ఇస్తేనే మేము ముందుకెళ్తామని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ తెలిపారు.
అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులను తిరిగి ప్రారంభించామని.. ఒక రాష్ట్రం బస్సులు మరో రాష్ట్రంలో ఎన్ని కిలోమీటర్లు నడపాలనే అంశాలపై చర్చ జరిగిందని ఏపీ ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు తెలిపారు.
అంతరాష్ట్ర బస్సు సర్వీసులు నడిపేందుకు ఇతర రాష్ట్రాల నుంచి ఏపీఎస్ ఆర్టీసీకి అనుమతి ఉందని.. ఇతర రాష్ట్రాల నుంచి రూట్ల లెక్కన స్పష్టత ఇవ్వాలని తెలంగాణ అడుగుతోందని ఇప్పటిదాకా ఏ రాష్ట్రం ఇలాంటి ప్రతిపాదన పెట్టలేదని ఏపీ ఆర్టీసీ ఎండీ తెలిపారు.
రెండు రోజుల్లో మరోసారి సమావేశం పెడుతామని.. అంతర్రాష్ట్ర బస్సులపై క్లారిటీ వచ్చిన తర్వాతనే ఇస్తామని తెలంగాణ అధికారులు చెప్పారని ఏపీ ఆర్టీసీ ఎండీ తెలిపారు. దీంతో రెండు రాష్ట్రాల మద్య బస్సుల పంచాయితీ ఇంకా తేలలేదని తెలుస్తోంది.