మాజీ మంత్రి, బీసీ నాయకుడు, అనిల్ కుమార్ యాదవ్.. నెల్లూరులో భారీ ఎత్తున నిర్వహించిన ఆత్మీయ సభపై అనేక విమర్శలు వస్తున్నాయి. ఆయన దీనిని బల ప్రదర్శనగానూ.. తన వైఖరిని ప్రకటించుకు నేం దుకు పెట్టిన సభగానూ విశ్లేషకులు చెబుతున్నారు. నిజానికి రెండు సార్లుగెలిచిన అనిల్.. చెప్పాల్సి వస్తే.. నేను నెల్లూరు సిటీ నియోజకవర్గానికి ఇది చేశాను.. మంత్రిగా అది తెచ్చాను.. ఇది చేశాను.. అని చెప్పుకోవాలి. మెజారిటీ ప్రజలు కూడా.. అదే ఆశించారు. తను మూడేళ్లపాటు మంత్రిగా ఉన్నారు. సో.. నియోజకవర్గానికి ఆయన ఏం చేశారో.. ఇప్పుడు ఏం చేస్తారో..చెబుతారని ఆశించారు.
కానీ, అనిల్‌మాత్రం .. ఈవిషయాల జోలికి పోలేదు. అంతేకాదు.. ఆద్యంతం ఆయన రాజకీయ విమర్శలు.. రాజకీయ ఎత్తుగడలకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చారు. వాస్తవాననికి రాష్ట్రం మొత్తం అనిల్ సభ అంటే.. ఏదో చెబుతారని ఎదురు చూసింది. మంత్రిగా పోలవరం బాధ్యతలను మూడేళ్లపాటు చూసిన.. ఆయన ఈ ప్రాజెక్టు విషయంలో ఏదైనా సంచలన విషయం చెబుతారేమోనని అనుకున్నారు. కానీ, ఆయన వ్యాఖ్యలు సంపూర్ణంగా.. ఆయనను ఆయన హైలెట్ చేసుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చారు.
మరోవైపు.. టీడీపీ, జనసేనలు కూడా అనిల్ సభను నిశితంగా పరిశీలించాయి. ప్రస్తుతం నెల్లూరు నుంచి మంత్రి అయిన కాకాని గోవర్ధన్‌పై అనిల్ సంచలన వ్యాఖ్యలుచేయడం ఖాయమని అనుకున్నారు. కానీ, పార్టీ హైకమాండ్ సూచనలతో అనిల్ కొంత తన ఆవేశాన్ని అణిచి పెట్టుకున్నట్టు కనిపించింది. ఇక, సభ విషయానికి వస్తే.. ఎందరో వస్తారని అనుకున్నా.. నియోజకవర్గం నంచి పెద్దగా రెస్పాన్స్ కనిపించలేదు. అంతేకాదు.. కార్పొరేటర్లు కూడా రాలేదు. కొందరు మాత్రమే వచ్చి.. మధ్యలోనే వెల్లిపోయారని వైసీపీలోనే చర్చసాగింది.
ఇక, మీటింగ్ విషయానికి వస్తే.. 2024 ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని, గెలుస్తానని.. మంత్రి ని కూడా అవు తానని.. అనిల్ చెప్పుకొచ్చారు. అయితే.. వాస్తవానికి వైసీపీలో అన్ని అధికారాలు సీఎం జగన్‌కే ఉన్నాయి. ఎవరికి సీటు ఇవ్వాలన్నా.. పదవి ఇవ్వాలన్నా.. ఆయన అభీష్టం మేరకే జరుగుతున్నాయి. అలాంటిది అనిల్ తనకు తానే సీటు ప్రకటించుకోవడంపై వైసీపీలోని సీనియర్లు పెదవి విరుస్తున్నారు. అంతేకాదు.. ఈ వ్యాఖ్యలపై సీఎం జగన్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ఇక, అనిల్ తన ప్రసంగంలో నెల్లూరులోని అందరు ఎమ్మెల్య పేర్లను ప్రస్తావవించారు.
కానీ, తాజాగా మంత్రి అయిన.. కాకాని గోవర్ధన్ రెడ్డి పేరును మాత్రం అనిల్ తన ప్రసంగంలో ఎక్కడా ప్రస్తా వించలేదు. పైగా.. టీడీపీ అనుకూల మీడియాలను.."ఈరోజైనా కొంచెం మంచిగా రాయండి" అని అనిల్ వేడుకున్న పరిస్థితి కనిపించింది. పదే పదే టీడీపీ, జనసేనల ప్రస్తావన తీసుకువచ్చిన అనిల్.. ఈ రెండు పార్టీల పొత్తులు లేకుండా పోటీచేయాలంటూ.. సవాల్ విసిరారు. అయితే.. ఈ వ్యాఖ్యలపై భిన్నమైన వాదన వినిపించింది. వాళ్లు కలిసి పోటీ చేస్తే. మనకెందుకు.. విడిగాపోటీ చేస్తే.. మనకెందుకు అనేవాదన బలంగా వినిపించింది. మంత్రిగా మూడుసంవత్సరాలు పనిచేసినా,, అనిల్ జనాలకు చేరువ కాలేక పోయారు.
ఈ విషయాన్ని నిర్మొహమాటంగా ప్రస్తావించిన.. అనిల్.. తాను జగన్‌కు సైనికుడునని.. పదే పదేచెప్పుకొ చ్చారు. అంతేకాదు.. తనకు జగనే అన్నీ.. అని చెప్పుకొచ్చారు. జగన్ బొమ్మతోనే.. తాను 75 వేల ఓట్లతో విజయం దక్కించుకున్నానని.. తనే ఒంటరిగా పోటీ చేస్తే.. కేవలం 3 నాలుగు వేల ఓట్లు మాత్రమే వచ్చేవని అన్నారు. ఇక, ఆసాంతం సభను గమనిస్తే.. జగన్ భజన బాగానే ఉన్నా.. కీలకమైన వైఎస్సార్ పేరు మాత్రం అనిల్ మరిచిపోయారో.. కావాలనే స్మరించలేదో.. తెలియదు కానీ.. వైఎస్సార్ అభిమానులు మాత్రం ఈ పరిణామంతో నొచ్చుకున్నారు.